కడప

చేనేత సంఘాల్లో అక్రమార్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 19: జిల్లా పరపతి కలిగి పనిచేయని చేనేత సహకార సంఘాల నేతలు అధికార పార్టీనేతల అండదండలతో కోట్లాదిరూపాయలు భోంచేస్తూ పనిచేసే సహకార పరపతి సంఘాలు, చేనేత కార్మికుల పొట్ట కొడుతున్నారు. కేంద్రప్రభుత్వం చేనేత సహకార సంఘాలను, చేనేత కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లరూపాయలు ఖర్చు చేస్తోంది. జిల్లాలో 110 చేనేత సహకార పరపతి సంఘాలున్నా పదుల సంఖ్యలో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది కేంద్రప్రభుత్వం చేనేత సంఘాలు, కార్మికులను ఆదుకోవడానికి మూతపడిన చేనేత మగ్గాల మిషన్లను పునరుద్దరించేందుకు కొంతమేరకు సంస్కరణలతో చేనేతను ప్రోత్సహిస్తూ నూతనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన మగ్గాలకు రూ.12కోట్లు కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 110 చేనేత సహకార సంఘాలు ఉండగా 10వేల మంది నేత కార్మికులకు, సక్రమంగా నడిపే పరపతి సంఘాలకు ఈ నిధులు అందించాల్సివుంది. గతంలో వందల కోట్లరూపాయలు సహకార పరపతి సంఘాల ముసుగులో దుర్వినియోగానికి పాల్పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విజిలెన్స్‌శాఖలు రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్రవిచారణచేసి అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేల్చారు. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన రూ.12కోట్లు విషయంలో సంబంధితశాఖ అధికారులు విడుదల చేసేందుకు మల్లగుల్లాలుపడుతున్నారు. పనిచేసే చేనేతకు, సహకారపరపతి సంఘాలకు అక్రమార్కుల పుణ్యమా అని నిధులు విడుదల చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. 2013-14లోనే ఈ నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. నాటి నుంచి నేటి వరకు అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోని కారణంగా చేనేత సహకారపరపతి సంఘాలు మూతపడటం, నేత కార్మికులు వలసబాట పట్టడం, ఉపాధిలేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేంద్రమేమో చేనేత వస్త్రాలనే ధరించాలని, చేనేత కార్మికులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఓ పక్క ప్రకటిస్తున్నా మరో పక్క అవినీతి అక్రమాలకు పాల్పడ్డ చేనేత సంఘాల పుణ్యమా అని వేలాది కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని నేత సహకార సంఘాలను, నేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.