కడప

రాజంపేట పురపాలక సంఘం ఎన్నికలపై టిడిపి దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 19: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించని నగర పాలక సంస్థలకు,పురపాలక సంఘాలకు మరో రెండుమాసాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం కాగా, జిల్లాలో ఎన్నికలు జరగని రాజంపేట పురపాలక సంఘం ఎన్నికపై టిడిపి అధిష్ఠానం దృష్టిసారించింది. ఇప్పటికే జిల్లాలో పలుమార్లు పర్యటించిన అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌లు రాజంపేట నేతలతో ఈ ఎన్నికలపై పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో సోమవారం అధిష్ఠానం రాజంపేటకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావును పంపడం, ఆయన టిడిపి నేతలతో విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి అధ్యక్షతన సమావేశమై ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని నాయకులను, కార్యకర్తలను రాజంపేటకు పిలిపించుకోకపోతే ప్రతిపక్ష నేత జగన్ జిల్లాలో అభాసుపాలవుతామని చురకలంటించారు. జిల్లాలోని నగర పాలక,పురపాలక సంఘాలకు చెందిన అధికారులకు పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజి నిర్మాణాలు, పెన్షన్లు తదితర అంశాల పరిష్కారంపై అనుభవం కలిగిన అధికారులందరికీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. రాజంపేటలో అధికారపార్టీలో మూడు గ్రూపుల ముక్కలాట జరుగుతూ మూడు సామాజికవర్గాలకు చెందిన నేతలు అధిష్ఠానానికి ఇప్పటికే పలుమార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు నేతలంతా స్పర్ధలు విడనాడి ఎన్నికల్లో పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వార్డుల వారీగా జిల్లా నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రతివార్డుకు స్థానికంగా ప్రజల్లో మంచి పేరు, పరపతి కలిగిన వారిని వెంటపెట్టుకుని ప్రచార బరిలోకి దిగాలని అభ్యర్థులు ఎవరనేది ముఖ్యం కాదని మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే ముఖ్యమని గంటా శ్రీనివాసరావు నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘాలకు సంబంధించిన అధికారులతో, జిల్లా నేతలతో మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే అధికారపార్టీలో రాజంపేటలో మూడుముక్కలాట కొనసాగుతుండటంతో మూడు సామాజికవర్గాలకు చెందిన నేతలు చైర్మన్ పోస్టులు తమ అనుచరగణాలకే ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లా రాజకీయాలు ఒక ఎత్తయితే రాజంపేట ఎన్నిలకు ఒక ప్రత్యేకత ఉంది. రాజంపేట మున్సిపాలిటీలో అధికారం చేజిక్కించుకొని పార్టీ పరంగా బలోపేతం కావడానికి నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పవచ్చు.