కడప

ప్రతిపక్ష నేతగా జగన్ తగడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 19: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా తగడని కడప జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ స్థానంలో అనుభవం ఉన్న సీనియర్ ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని వైకాపా నాయకులకు సూచించారు. సోమవారం కడపలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిఇ అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా పోయిందన్నారు. ఆయనకు ఎంతసేపు రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడడమే తప్ప సభాహక్కులు కాపాడాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందన్నారు. అనుభవరాహిత్యం వల్లే జగన్ ఇలా ప్రవరిస్తున్నాడన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం జగన్ నైజంగా మారిందాన్నారు. ప్రాంతాలవారీగా, మతాలవారీగా విభజించు పాలించు అన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి అర్హులందరికీ అందేలా
చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయితే పోలవరం విషయంలో జగన్ అవాంతరాలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టగానే పూర్తికాదని అవాకులు చెవాకులు పలికిన జగన్ తీరా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక నోరుమెదపడం లేదన్నారు. అభివృద్ధి అంటే ప్రతిపక్ష నేతకు ఇష్టం లేదని, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తూవచ్చారన్నారు. ప్రజలు ప్రతిఒక్కటీ గమనిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నేతను మార్చుకుంటే 2019 ఎన్నికల నాటికి అరకొర సీట్టయిన వస్తాయని, లేకుంటే పార్టీ గల్లంతేనని గంటా జోష్యం చెప్పారు.
ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి బాబు రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన హోదాపై పోరాటాన్ని చంద్రబాబు వదులుకోరన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాసంక్షేమం , అభివృద్ధి ,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్దంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అధికారదాహంతో వైకాపా నేతలు, మిగిలిన పార్టీల వారు మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటికి భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేస్తారన్నారు. జిల్లాలోని రాజంపేటను తెలుగుదేశం చేజిక్కించుకుంటుందన్నారు.