కడప

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, సెప్టెంబర్ 22: గతవారం మండలపరిధిలోని గంగవరం రోడ్డులో మోటర్‌సైకిల్‌పై వెళుతున్న తిరుపాలయ్య మరో వాహనాన్ని ఢీకొని తీవ్ర గాయాలకు గురై తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి ఔట్‌పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందడంతో పోస్టుమార్టం నిమిత్తం అక్కడికి వెళ్లి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
మహిళలకు తీవ్రగాయాలు
రైల్వేకోడూరు, సెప్టెంబర్ 22:కోడూరు అరుంధతీవాడ సమీపంలో గురువారం ఉదయం ఓ లారీ విద్యుత్ స్థంభాన్ని ఢీ కొంది. అటుగా వెళ్తున్న రమణమ్మపై స్తంభంవిరిగి మీద పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్సకోసం తిరుపతి రూయాసుపత్రికి తరలించారు. కాని విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న వాహనం కనిపించక పోవడంతో విద్యుత్‌శాఖ అధికారులు ఆ వాహనం కోసం విచారిస్తున్నారు.