కడప

బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించాలి-కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 22:జిల్లాలో రుతుపవనాలు వల్ల వర్షాలు బాగా కురుస్తుండటంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులు 1.75లక్షల హెక్టార్లలో పంటసాగు చేస్తున్నారని, బ్యాంకర్లు రైతులకు రుణాలందించడంలో లక్ష్యాలను 120 శాతం అధిగమించి సాధించాల్సిందిగా కలెక్టర్ కెవి సత్యనారాయణ బ్యాంకర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ సిండికేట్‌బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 43 శాతం వృద్ధిరేటు సాధించగలమన్నారు. బ్యాంకర్లు డికెటి పట్టాలు కలిగిన రైతులందరికీ రుణాలు మం జూరు చేయాలని, డిసిసి బ్యాంకు ఇప్పటి వరకు డికెటి పట్టాలకు రుణాలు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారని, ఎటువంటి అనుమానాలు లేకుండా డికెటి పట్టాలు కలిగిన రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ ఏడాది మైక్రో ఇరిగేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచిందని, 10 ఎకరాలు ఉన్న రైతులకు 90శాతం సబ్సిడీ, 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు 50శాతం సబ్సిడీ అందిస్తోందన్నారు. గత ఏడాది 1.39 లక్షల హెక్టార్లలో పంటసాగు చేయగా ఇప్పటికే 1.75 లక్షల హెక్టార్లలో రైతులు సాగుచేస్తున్నారన్నారు. రైతు లు పండిస్తున్న పంటలకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నందున బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు.
గత ఏడా ది పంట రుణాలు రూ.5500 కోట్లు లక్ష్యానికి గాను లక్ష్యాన్ని 109శాతం అధిగమించి రూ.6500 కోట్లు బ్యాం కర్లు రుణ సౌకర్యం కల్పించినందుకు అభినందించారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.8619.98 కోట్లు రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకర్లు లక్ష్యం కేటాయించిందని, జూన్ నెలాఖరుకు రూ.2130.48కోట్లు బ్యాంకర్లు మం జూరు చేశారని, మార్చి 2017 లోపు లక్ష్యాలను మించి సాధించాలన్నారు. వ్యవసాయ రంగానికి రూ.4910.87 కోట్లు లక్ష్యానికి గాను జూన్ నాటికి రూ.1453.91కోట్లు సా ధించారని కలెక్టర్ వివరించారు.
ప్రతినెల 3వ శుక్రవారం మండలంలో ఎంపిడివో, తహశిల్దార్, బ్యాంకర్లతో ఎంపిడివో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు మంజూరులో స్థానిక సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. ఈసమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌బిఐ ప్రతినిధి గణేష్, నాబార్డు ఏజిఎం శ్రీనివాసులు, సిండికేట్ బ్యాంక్ రీజనల్‌మేనేజర్ ఆశీర్వాదం, ఎల్‌డిఎం రఘునాధరెడ్డి, ఆంధ్రబ్యాంకు ఏజిఎం క్రిష్ణమూర్తి, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.