కడప

వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్),సెప్టెంబర్ 22:వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం మేరకు 182 గ్రామాల్లో 42వేలు అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని ఎంపిడిఓలను కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆర్డీఓలు, మండల అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు-చెట్టు, డ్రిప్ ఇరిగేషన్, మండల పరిస్థితి, సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోపడుతున్న వర్షాలకారణంగా చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయే పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి వరద పరిస్థితి, చెరువుల స్థితిపై జిల్లారెవెన్యూ అధికారికి తెలియజేయాలన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులపై ఒక వారం రోజులలోపు తనిఖీ నివేదికలతోపాటు ఫోటోలు సమర్పించాలన్నారు. క్లోరినేషన్ బాగా చేయాలన్నారు. రాయచోటి, రామాపురం, చక్రాయపేట, గాలివీడు, కోడూరు మండలాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తమై మరింత విస్తృత సేవలు అందించాలన్నారు. ఇందుకు విలేజ్ శానిటేషన్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారులు, గ్రామసర్పంచ్‌లపై వ్యాధుల నివారణ బాధ్యత ఉందన్నారు. మండల అభివృద్ధి అధికారులు, ఇవో ఆర్డీలు, పంచాయతిసెక్రటరీలు, విఆర్‌ఓలు, విఆర్‌ఏలు ప్రత్యేకశ్రద్ద పెట్టాలన్నారు. ఈనెల 24వ తేది దోమలపై యుద్ధం కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో ,గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈసమావేశంలో డిఆర్‌డిఏ , డ్వామా పిడిలు అనిల్‌కుమార్‌రెడ్డి, రమేష్, సిపిఓ తిప్పేస్వామి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.