కడప

వరిసాగుకు ఉరి పడినట్లేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 22:ప్రభుత్వమేమో ఆహార ఉత్పత్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించాలంటూ జిల్లాలో వేరుశెనగ తర్వాత ప్రధాన పంట అయిన ఈ ఏడాది వరిసాగుకు ఉరి పడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం వరిసాగుకు కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమయ్యాయి. అన్ని ప్రాంతా ల్లో అరకొర సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా వరికి తెగుళ్లు సోకి వేలాది ఎకరాల పంటలు ఎండుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు ప్రాంతాలకే వర్షాలు పరిమితమయ్యా యి. మిగిలిన ప్రాంతాల్లో ఖరీఫ్‌సీజన్‌కు అవసరమైనంత వర్షం కురవలేదు. గతంలో సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ అధికారులు, సిబ్బం ది కొరత తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం రైతులకు సలహాలు, సూచనలు ,శిక్షణలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి నియామకాలు జరిగాయి. అయినా వ ర్షాలు కురవని కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెట్టి వరికి ఉరిపడేటట్లు వరుణుడు చిన్నచూపుచూశారు. జిల్లాలో కుందు, పెన్నా , ఆదినిమ్మాయపల్లె, నదీ పరివాహక ప్రాంతాలతోపాటు కెసి కెనాల్‌కే నీరు పరిమితమైంది. మైలవరం, గండికోట, పులివెందుల బ్రాంచికెనాల్, కుషావతి, ఝరికోన, అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులున్నా ఆశించిన మే రకు నీరు చేరలేదు. బ్రహ్మంసాగర్‌కు నీరు చేరినా పెద్దగా నీరు వరిసాగుకు అందించలేకపోతున్నారు. పెద్ద పెద్ద కుంటలు, చెరువులు వందలాదిగా ఉన్నా 50 చెరువుల కిందనే సాగుకునోచుకుంది. ఖరీఫ్‌లో జిల్లాలో వరిసాగుకు 43732 హెక్టార్ల సాధరణ విస్తీర్ణం కాగా, సాగు విస్తీర్ణం 21700 హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకుని 48శాతం మాత్రమే వరిసాగుచేశారు. రబీలో వరిసాగు ఏమాత్రం నోచుకుంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే వర్షాలు ఆలస్యంగా కురవ డం, తరచు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ద్రోణితో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుని ఉష్ణోగ్రతల్లో మార్పు కారణంగా రైతులు సాగుచేసిన వరికి చీడపీడలు పట్టాయి. ఇక జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లోసాగుచేసిన వేరుశెనగ, బుడ్డశెనగ, కంది, ఆముదం, పత్తి, పెసర, అలసంద, మినుము, జొన్న, సజ్జ పం టల దిగుబడి సమయానికి వర్షాలు కురవకపోవడంతో ఆ పంట పొలాలు రైతులకు చేతికొచ్చేది అంతంతమాత్రమే. నాసిరకం పంటే వస్తుండటంతో అవి అమ్మకాలు జరిగేవరకు రైతుల్లో నమ్మకాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం సాగుచేసిన వరికి క్రిములు, కీటకాలతోపాటు వై రస్ వరికిసోకి వరికి ఈ ఏడాది ఉరి పడినట్లయ్యింది.