కడప

ధర్మసంస్థాపనకే భగవంతుడి అవతారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), సెప్టెంబర్ 22: ఆయా యుగాల్లో ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు వివిధ అవతారాలు దాల్చారని జ్ఞాన బ్రహ్మస్వామి స్వామి సుందరచైతన్యానంద అన్నా రు. 290వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ మైదానంలో సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ద్వాపర యు గంలో రాక్షసుల మారణ కాండను చూడలేక భూదేవి సైతం రాక్షసుల ఆకృత్యాలు మోయలేక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని మొరపెట్టుకుందని ఆయన కూడా తల్లీ నావల్లకాదు అది శ్రీమహావిష్ణువు వల్లనే సాధ్యపడుతుందని చెప్పడంతో పాలసముద్రంలో పవళిస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి చెప్పగా విష్ణుమూర్తి భూదేవిని శాంతపరుస్తూ భూమాత నీ బాధలు తొలిగిపోనున్నాయి, కంసు డు తదితర రాక్షసుల ఆకృత్యాలకు అంతిమగడియలు దాపురించాయన్నారు. దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మిస్తున్నాడని ఆయన ద్వారా రాక్షసులు అంతమొంది లోకంలో ధర్మస్థాపన కలుగుతుందని మహావిష్ణువు భూదేవికి కృష్ణుడి జన్మవృత్తాంతాన్ని తెలియచెప్పిన విషయాన్ని సుందరచైతన్యానంద స్వామి భక్తులకు విశదీకరించారు. మానవుడి అవసరాలు తీర్చేందుకే ధనం ఉపయోగించాలని, ధనమే అవసరంగా జీవించడం మంచిదికాదని ఆయన తెలిపారు. మహాభారతంపై ఆయన ప్రసంగించినతీరు భక్తులను అలరించింది. మానవునిలోని బాధలు భగవంతుడికి దగ్గరి చేరుతాయని, సుఖా లు ఆయనకుదూరం చేస్తాయని భక్తుల జీవితమే భాగవతమని ఆయన విశే్లషించారు. భాగవతం , భాగవతం అంటూ ఉంటే భాగుపడతామని సుందరచైతన్యానంద స్వాములు సెలవివ్వడంతో భక్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ప్రవచనాలలో భాగంగా స్వామివారు పలుపాటలు కమ్మని స్వరంతో ఆలపించి భక్తులను ఓలలాడించారు. పద్యాలు, మాట్లాడిన విధానం సభను అలరించింది.