కడప

గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 22:గతనెలరోజులుగా అడప దడప కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పులకు గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, నిధులుంటే పారిశుద్ధ్యం పనులు చేపడతామని నిధులులేక గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పక్కనపెడితే అభివృద్ధే అభివృద్ధి జరగడం లేదని, తమకొచ్చేఅరకొర నిధులతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయలేకపోతున్నామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమకు నెలసరి జీతాలు వస్తే చాలనే ఉద్దేశ్యంతో వారు అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు, ఫీల్డ్ సిబ్బంది మొక్కుబడిగా గ్రామాలకు వచ్చి తమకు ఎవ్వరూ సహకరించడం లేదని తమ స్థాయిలో తాము ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామని వారు సమాధానం ఇచ్చి చేతులుదులుపుకుంటున్నారు. వర్షం వస్తే చాలు గొట్టపుబోర్ల వద్ద, నీళ్లట్యాంకుల వద్ద , కుళాయిల వద్ద ఎక్కడి నీరు అక్కడే నిల్వవుండి , ఈగలు, దోమలు సంసారం చేస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా నిర్మించడంతో సరైన డ్రైనేజి సౌకర్యం లేక వర్షపునీరు, ఇళ్లల్లోని మురుకునీరు ఏకమై పారుతోంది. ఆ రొచ్చులోనే ఆ కంపునీటిలోనే ప్రజలు సంచరిస్తున్నారు. కొన్ని గొట్టపుబావులు అయితే అపరిశుభ్రత నీరు కూడా బోర్లలోకి వెళుతోంది. ఈ నీరు తాగుతున్నందున అంటువ్యాధులు ప్రబలి ప్రజలు మంచానపడుతున్నారు. ఇక కేంద్రప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రారంభదశలో పారిశుద్ద్యం చేపట్టిన దాఖలాలు అంతంతమాత్రమే. ప్రత్యేకించి మలేరియాశాఖ ఉన్నా ఆశాఖలో సిబ్బంది తక్కువగా ఉండటంతో వారు సైతం డిటిపి స్ప్రేచేయడం కానీ, మలాసిన్ స్ప్రేచేయడం కానీ, క్లోరినేషన్ ఫాగింగ్ అంతంతమాత్రంగానే చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో అధికారులు సమావేశాలకు, సమీక్షలకు పరిమితవౌతున్నారే తప్ప గ్రామాల్లో పారిశుద్ద్యంపై దృష్టిపెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్లు, నిధులున్న పంచాయతీల్లో పలువురు సర్పంచ్‌లు, కార్యదర్శులు ఏకమై నిధులు ఖర్చుచేసినట్లు లెక్కలు రాసుకుని నామమాత్రంగా పారిశుద్ద్య కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 790 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 9 మేజర్ , 781 మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, వాటర్ షెడ్ పనులు, నీరు-చెట్టు పనులకే అధికప్రాముఖ్యత ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.25,69,94,200, 4శాతం గ్రాంట్ 17,89,900, సీజరైజ్ గ్రాంట్ 66,24,000 గత ఆర్థిక సంవత్సరంలో విడుదలైంది. విడుదలైన నిధులు తమ గ్రామపంచాయతీల్లో చిన్నపాటి అభివృద్ధి పనులకే ఖర్చు చేయలేకపోతున్నామని ఇక శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని పారిశుద్ధ్యం కార్యక్రమం పనులు చేపట్టలేమని చేతులెత్తేశారు. చర్యలు తీసుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.