కడప

రాజంపేటలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, సెప్టెంబర్ 22:రాష్ట్రంలో వాయిదా పడ్డ రాజంపేట మున్సిపాలిటీ ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు చేరువ అయ్యేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తుంది. తాజాగా రాష్ట్ర మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రాజంపేట మున్సిపాలిటీలోని 20 వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టణ వీధులలో పర్యటించిన సందర్భంగా శానిటేషన్ ఆధ్వాన్న స్థితిలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌కు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. దీంతో మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీలోని 20 వార్డులకు గాను 5 టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ మెంబర్లు, ఇతర పార్టీ నేతలు కూడా మున్సిపల్ సిబ్బందితో కలిసి పాల్గొని ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయో? జరగవో తెలియదు కాని రాజంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు మొదలవ్వడంతో అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా పట్టణంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు కూడా నివేదికలు సిద్ధమవుతున్నాయి. విద్యాపరంగా ఇప్పటికే జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనుల సిద్ధం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా రూపొందించాలని, మున్సిపాలిటీకి చెందిన పాత బస్టాండులోని స్థలంలో మల్టీ స్టోరేజీ భవనాన్ని నిర్మించి సాలీనా మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తసీకోవాలని మేడా వెంకట మల్లికార్జునరెడ్డి చేసిన విజ్ఞప్తిపై కూడా జిల్లా మంత్రి గంటా సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా మున్సిపాలిటీలోని ప్రజలకు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు మంజూరు మొదలు ఇతరత్రా పథకాలతో పాటు కుట్టు శిక్షణా కేంద్రాలతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలన్నది అధికార పార్టీ వ్యూహం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి రాజంపేట మున్సిపాలిటీకి ఎన్నిక జరిగితే గెలుపుతో పాటు 70 శాతం పైగా ఓట్లు సాధించాలన్న ఆదేశాలు పార్టీ ముఖ్యనేతలకు వచ్చి ఉన్నట్టు సమాచారం. కాగా గురువారం రామ్‌నగర్, మార్కెట్ తదితర ప్రాంతాలలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యం మెరుగు చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కాలువలలో పూడికతీత, చెత్త, మట్టిదిబ్బలను తొలగించడం, రోడ్లను శుభ్ర పరచడం, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించడం, ఖాళీ ప్రదేశాలలోని పిచ్చిమొక్కలు తొలగించడం, డోర్ డోర్ టు చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టడం, కాలువలలో, ఇతరత్రా అపరిశుభ్రతతో పాటు ఇనుప వస్తువులు, ఇతరత్రా వస్తువులు నిల్వ ఉండే చోట దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేయడం, పబ్లిక్ కుళాయిల చుట్టూ ప్లాట్‌ఫామ్‌ను సరిచేసి, ఏ విధంగా నీరు నిల్వ ఉండకుండా చూడడం, ప్రస్తుత వర్షాకాలంలో అంటువ్యాధులు, డెంగ్యూ, డయోరియా, మలేరియా, స్వైన్ ప్లూ తదితర వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిర్ణయించిన కార్యాచరణ. అలాగే జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు నేతృత్వంలో ప్రత్యేక సిబ్బంది ప్రజలను అంటువ్యాధులపై అప్రమత్తం చేయడంతో పాటు యాంటీ లార్వా మందును కాలువలలో చల్లించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు కూడా నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచుకునే అంశంపై కూడా మున్సిపల్ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో దృష్టి కేంద్రీకరించడం జరిగింది.