కడప

కడప గడపకు కంఠాభరణం గండికోట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 25: రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప జిల్లా పలు అందమైన పర్యాటక ప్రదేశాల సమహారంగా బాసిల్లుతోంది. చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యానికి చెక్కు చెదరని కట్టడాలను చూస్తే మనస్సు కదిలిస్తుంది. కథలు వింటే వళ్లు పులకరిస్తుంది. కడప అంటే కక్షల కడప అని పిలువడం బాధాకరం. కాని జిల్లాలో ప్రతి ప్రాం తానికి, ప్రతి కట్టడానికి ఓ కథ ఉంది. కళలకు, కవులకు, కళాకారులకు, చిత్రకారులకు కొదవ లేని జిల్లాలో వారు సృష్టించిన అద్భుతాలను చూస్తే ఈ జిల్లాపై ఉన్న అపవాదు ఎక్కడా కనపడదు అనేది నగ్న సత్యం. కొండ కోనల నడుమ రమణీయ దృశ్యాలతో పచ్చని అడవులతో చారిత్రాత్మక కోటలతో ఆకట్టుకునే అందాలు కడప సొంతం. కాగా వచ్చే నెల 16,17వ తేదీల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కడప గడపకు
కంఠాభరణం గండికోట
కడప జిల్లా జమ్మలమడుగుకు 10కి.మీ దూరంలో పెన్నానది ఒడ్డుపై నిర్మితమైన గండికోట ఎంతో చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. సముద్రమట్టానికి 1670 అడుగుల ఎత్తులో ఉన్న కొండల మధ్య గండికోటను నిర్మించారు. పెన్నానదికి 5కి.మీ. పొడవునా ఉన్న గండి, అందులోని ప్రవాహం సహజ కందకంగా దుర్బేద్యమైన కోటగా గండికోట విరాజిల్లుతోంది. అద్భుత శిల్పకళా రసభంగిమలతో అలరారుతున్న ధృడమైన సుందర కట్టడాలను కలిగి ఉన్న ఈ కోట 40 అడుగుల ఎత్తులో చుట్టూ 101 బురుజులతోనూ , 20 అడుగుల ప్రధాన ద్వారంతో తనరీతిని ప్రదర్శిస్తూ ఉంటుంది. శాసనాలు, చారిత్రాత్మక కట్టడాల ఆధారంగా గండికోటను క్రీ.శ.1123లో కాకరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. వైదుంబులు, రాష్ట్ర కూటులు, కళ్యాణిచాళుక్యులు, చోళులు,కాకతీయులు, కాయస్థులు, విజయనగర రాజుల ప్రాబల్యంలో అలనాడు వైభవంగా వెలిగిన గండికోట జిల్లాలోని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో రెండు కొండల నడుమ అంతులేని అగాధంలో పెన్నానది ప్రవహిస్తోంది. ఒంపులు తిరిగిన కొండదారిలో వయ్యారాలు ఒలకబోస్తూ సాగే ఈ నదికి మైలవరం వద్ద జలాశయం నిర్మించారు. సృష్టిలోని అందమంతా పుణికిపుచ్చుకున్నట్లున్న అతిమనోహరమైన ఈ దృశ్యం రమణీయం. శత్రుదుర్భేద్యమైన గండికోటలో 12 సుప్రసిద్ద ఆలయాలు, 300 దాకా శివతీర్థాలుండేవని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు ఆలయాలు, తీర్థాలు మాత్రమే కానవస్తున్నాయి. రఘునాధ, మాధవస్వామి ఆలయాలు విజయనగర శిల్ప కళారీతులతో విరజిల్లుతున్నాయి. విశాలమైన మండపాలు, మండపస్థంభాలు, రమణీయమైన శిల్పకళా సంపదతో అలరారుతున్నాయి. జానపద దృశ్యాలు, వివిధ నాట్యభంగిమలు, రామాయణం, మహాభారత గాథల్లోని ఎన్నో సుందర దృశ్యాలు పర్యాటకులకు కనువిందుచేస్తున్నాయి. 1309లో మహమ్మదీయుల పాలనలో దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నట్లు చరిత్ర చెబుతోంది. గండికోటకు జామియా మసీదు ఒక ప్రత్యేక ఆకర్షణ. మసీదుచుట్టూ విశాలమైన ప్రాకారం ఆ ప్రాకారం చుట్టూ లోపల 64, బయట 32 గదులు, 3 ప్రత్యేక ద్వారాలు, సమున్నతమైన సోపాన పంక్తులతో ఎతైన రెండు మీనార్లు నిర్మించబడి వున్నాయి. మసీదులోని గోడల మనుపుదనం నిగనిగలు ఈనాటికి చెక్కుచెదరకుండా చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పకతప్పదు. మీర్‌జుమా నిర్మించిన ధాన్యాగారం 10మీటర్ల ఎత్తులో 12 స్తంభాలతో దీర్ఘచతురస్త్రంగా నిర్మించిన కట్టడం. ధాన్యాగారం మక్కామసీదుకు, రఘునాథస్వామి ఆలయానికి మధ్యలో ఉంది. వర్షం వల్ల ధాన్యాగారంలోని ధాన్యం చెడిపోకుండా పై కప్పుపై చక్కని రాతికంకరచే గచ్చువేశారు. జైలు, రంగమహల్, ఎర్రకోనేరు అదనపు ఆకర్షణలు. మనసులను పులకరింపజేసే ఈ అపురూప దృశ్యాలను అందించే గండికోటను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

టెక్స్‌టైల్ పార్కుకు మోక్షమెప్పుడో!

మైలవరం, సెప్టెంబర్ 25: చేనేతల అభివృద్ధికోసం మైలవరంలో చేపట్టిన టెక్స్‌టైల్‌పార్కు నిర్లక్ష్యపునీడలో కొట్టుమిట్టాడుతోంది. అధికారుల నిర్లక్ష్యం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కరువవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది చేనేతలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన టెక్స్‌టైల్ పార్కు నిరుపయోగంగా మారిపోతోంది. వివరాల్లోకెళ్తే...చేనేతలకు ఉపాధితోపాటు, వృత్తి కార్మికుల నైపుణ్యం పెంచేందుకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనతో టెక్స్‌టైల్‌పార్కు చేపట్టారు. సుమారు రూ.7.9కోట్లతో 2005మే 24వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ టెక్స్‌టైల్‌పార్కుకు శిలాఫలకం వేశారు. మండల కేంద్రమైన మైలవరంలో 62.18 ఎకరాల్లో 2006లో టెక్స్‌టైల్ పార్కు పనులను ఎపిఐయస్‌సి వారు ప్రారంభించారు. టెక్స్‌టైల్ పార్కులో 118 యూనిట్లుగా విభజించారు. ఇందులో ముఖ్యంగా డైయింగ్, హ్యాండ్‌లూమ్స్, పవర్‌లూమ్స్, గార్నమెంట్ తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు వీలుగా యూనిట్లకు ప్రణాళికలు సిద్ధంచేశారు. టెక్స్‌టైల్‌పార్కులో ఇప్పటికి సుమారు రూ.2.80కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంకు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజి కాలువలు, ఫెసిలిటి సెంటర్ బ్యాంకు, సమావేశం భవనం, క్యాంటీన్ భవనాలు, ప్రహరీ వంటి పలు నిర్మాణాలు జరిగాయి. ఇంతవరకు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా టెక్స్‌టైల్ పార్కు మాత్రం నిరుపయోగంగా వుంది. ముఖ్యంగా ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం కొరవడం టెక్స్‌టైల్‌పార్కుకు శాపంగా మారింది. కేటాయించిన స్థలం ప్రభుత్వానిదే అయినా సర్వేనెంబర్ల పరంగా రెవెన్యూ తరపున తలెత్తిన సమస్య ఇబ్బందికరంగా మారింది. కలెక్టర్, చేనేత, జౌళిశాఖ అధికారుల చొరవతో నివేదికను సిసియల్‌ఎ పంపారు. అక్కడి నుండి క్లియరెన్స్‌వస్తే టెక్స్‌పార్కుకు మోక్షం లభించినట్లవుతుంది.