కడప

పాఠాలు సరిగా చెప్పని టీచర్లు ఇంటికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 15: రాష్ట్రంలో కెజి నుండి పిజివరకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం రాజంపేట ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో సరిగా విద్యాబోధన చేయని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని, అలాగే మంచిగా చదువుచెప్పే టీచర్లకు ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో 16.5శాతం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి 5 జాతీయస్థాయి విద్యాసంస్థలు వచ్చాయని, మరో రెండు రావాల్సి ఉందని అన్నారు. ఆ రెండింటినీ కూడా ఈ విద్యా సంవత్సరం నుండే ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌ఎం, విట్ తదితర ప్రఖ్యాత యూనివర్శిటీలను ఎపిలో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యలో సంస్కరణలకు కమిటీ వేసి అవసరమై ఉద్యోగాలను భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే 5మార్లు వైస్‌చాన్సలర్ల సమావేశాలు నిర్వహించి ప్రమాణాలు పెంచేందుకు ఎజెండా రూపొందించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడామైదానం, ఫర్నీచర్, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, రూ.5వేల కోట్లతో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎంఇఓ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం యోచినట్లు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హైస్కూల్స్‌లో విద్యార్థులు కోరుకున్న విధంగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రవేశపెట్టనున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు వివిధరకాల సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. ఈ సమావేశంలో విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.