కడప

రామయ్య మృతి టిడిపికి తీరనిలోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 15: రాజంపేట పార్లమెంట్ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్ నేత జి.రామయ్య హఠాన్మరణం పార్టీకి, రాజంపేట ప్రజలకు తీరనిలోటని మహానేతగా ఎదిగిన ఆయన మరణించి దూరమైన ఆయన సేవలు మరువరానివని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రామయ్య హఠాన్మరణంతో శుక్రవారం కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈసందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రామయ్య సేవలు కొనియాడారు. అలాగే కేంద్రమాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్ మాట్లాడుతూ రామయ్య అజాతశత్రువని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు మాట్లాడుతూ తనకు అన్ని రంగాల్లో ఆప్తుడని , రామయ్యను కోల్పోవడం తనతోపాటు పార్టీకి తీవ్రనష్టమన్నారు. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రామయ్య రాజకీయంగా ,పారిశ్రామికంగా ఎటువంటి ఒడుదుడుకులు, శతృత్వం లేకుండా ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. పార్టీ జిల్లా అద్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి (వాసు)మాట్లాడుతూ భౌతికంగా రామయ్య లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా పార్టీ నేతలంతా రెండునిమిషాలు వౌనం పాటించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల డైరెక్టర్ రామ్‌గోపాల్‌రెడ్డి, కార్యనిర్వహణ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవర్దన్‌రెడ్డి, ఆర్టీసి మాజీ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు, తెలుగురైతు రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకటసుబ్బయ్యనాయుడు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతోపాటు నాయకులు దుర్గాప్రసాద్, జిలానీబాషా, అమీర్‌బాబు, సుభాన్‌బాషా, జలతోటి జయకుమార్, నాసర్ అలీ, అల్లాబకష్ పాల్గొన్నారు.