కడప

జిల్లాపై ఎస్పీ మార్కు ముద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 22: చౌకదుకాణాల్లో అక్రమాలు, ఇసుకమాఫియాపై ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడుచౌకదుకాణాల నుంచి అక్రమంగా సరుకు రవాణాకాకుండా, ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టి జిల్లాలోని అధికారపార్టీ నేతలకు సింహస్వప్నంగా నిలిచాడు. అదే ఫార్ములాతో జిల్లాలోని ఎర్రచందనం, ఇసుకమాఫియాలపై ప్రత్యేక దృష్టిసారించారు. చౌకదుకాణాల్లో అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యానికి అడ్డుకట్టవేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారపార్టీ నేతలు చట్టప్రకారం, న్యాయసమ్మతమైన వ్యవహారాల్లో మాత్రమే ఏ ఒక్కనేత ఫోన్‌చేసినా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పోలీసుయంత్రాంగం పరిపాలన విషయంలోనూ అవినీతి అక్రమార్కులైన ఏ ఒక్క నాయకుడుకానీ, ప్రముఖులు కానీ వచ్చినా సంబంధితనేతలకు స్థిమితంగానే చట్టం తనిపని తాను చేసుకుని పోతుందని తమకు సహకరించినప్పుడే జిల్లా అభివృద్ధి జరుగుతుందని తాను ఎటువంటి వత్తిళ్లకు లొంగడం, అక్రమార్కులకు సహకరించడం కానీ జరగదని తేల్చిచెబుతున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ చర్యలతో అధికార, ప్రతిపక్షనేతలు సైతం నోరుమెదపకుండా పోలీసుశాఖకు సంబంధించి నేతలు ఏ పనులు అడిగినా ఎస్పీ అందరికీ సమన్యాయం చేస్తామని పోలీసుశాఖకు సంబంధించిన వ్యవహారాలు తమ వద్దకు తీసుకురావద్దని తెగేసిచెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది నేతలు ఇసుక మాఫియా, క్రికెట్, మట్కా, జూదం, ఫ్యాక్షనిస్టులకు సహకరిస్తున్న నేతల విషయంలో ఎస్పీ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ సంపద అయిన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న నేతలకు అధికారపార్టీ కార్యకర్తలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎస్పీ తన సొంతశాఖలో అనూహ్యరీతిలో భారీమార్పులు తీసుకుని సబ్ డివిజన్ వారీగా ఎక్కువకాలం పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలకు చుక్కలుచూపి వారందరినీ ఇప్పటికే బదిలీ చేశారు. ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసుశాఖలో కూడా దీర్ఘకాలంగా పనిచేస్తున్న వివిధ విభాగాల్లోని అధికారులను, సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేశారు. చివరకు హోంగార్డులను సైతం మార్పులుచేసి భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. శుక్రవారం పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంస్మరణదినోత్సవం సందర్భంగా వసూళ్లరాయళ్లకు కళ్లెంవేశారు. దసరా మామూళ్లు, బెల్టుషాపులు, బ్రాందీషాపుల మామూళ్లరాయుళ్లకు కూడా కళ్లెంవేశారు. చాలా మంది రాజకీయపరపతి కలిగిన పోలీసు అధికారులు, సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేయించుకోవడం కానీ, వీఆర్‌లోకి వెళ్లి పనిచేసుకోవడం మంచిదని భావిస్తూ ఎస్పీ చర్యలతో బెంబెలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ కూడా కష్టపడి పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ నిక్కచ్చిగా వ్యవహరించే వారికి సహకరిస్తున్నారు. పోలీసు సంక్షేమం విషయంలో కూడా వారికి కావాల్సిన రాయితీలను ప్రభుత్వం నుంచి తెప్పించడం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టిసారించి కిరాయి హంతకులు, కిరాయి ముఠాలపై నిఘా పెంచారు. మొత్తంమీద జిల్లా ఎస్పీ చర్యలతో నేతలు, పోలీసు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

ప్రకటనలకే పరిమితమైన షటిల్ రైలు!
రాజంపేట, అక్టోబర్ 22: రాయలసీమ ప్రాంతం రైల్వేపరంగా దశాబ్దాలుగా వెనుకబడిపోతుంది. రేణిగుంట-గుంతకల్ రైలుమార్గం మొత్తం రాయలసీమ జిల్లాల మీదుగానే వెళ్తోంది. చిన్నచిన్న రైల్వే సమస్యలు, రైల్వేపరంగా సౌకర్యాలు కల్పించుకోవడంలో కూడా ఇక్కడి పార్లమెంటు సభ్యులు దశాబ్దాలుగా ఆశించిన రీతిలో సఫలీకృతులు కాలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రైల్వేపరంగా వెనుకబడిన ప్రాంతం ఏది అని వెతికితే రాయలసీమలో మరీ ముఖ్యంగా ఈ మార్గమే ముందువరుసలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా గత 20 సంవత్సరాల కాలంలో కొత్త రైళ్లు అడపా దడపా వచ్చినా, ఈ మార్గంలో ఉన్న రైళ్లుకూడా రద్దవ్వడం జరిగింది. నందలూరు-రేణిగుంట, నందలూరు-ఎర్రగుంటల మధ్య షటిల్ రైలు సర్వీసులు నడిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు గతంలో ఇక్కడి పార్లమెంటు సభ్యులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో తెలియడం లేదు. ఏళ్లు గడుస్తున్నా షటిల్ రైలు సర్వీసుల జాడ కానరావడం లేదు. షటిల్ రైలు సర్వీసులు నడిపేందుకు అవసరమైన కృషి కూడా ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు చేస్తున్నారా అంటే సమాధానం తెలియని పరిస్థితి. షటిల్ సర్వీసులు ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందన్నది ప్రక్కనుంచితే ముంబాయికెళ్ళే ప్రయాణికులతోపాటు, నిమ్మ పంటను రవాణా చేసేందుకు రైతులకు ఎంతో అనుకూలంగా ఉన్న జనతా ఎక్స్‌ప్రెస్ రైలును ఈ ప్రాంతంలో రద్దుచేసి రెండు దశాబ్దాలు పైగానే అవుతోంది. రేణిగుంట-గుంతకల్ మార్గంలో డబ్లింగ్ పూర్తికాకపోవడాన్ని గతంలో కొత్త రైళ్ల రాకకు అడ్డంకిగా రైల్వేశాఖ చూపుతూ రావడం జరిగింది. ఈ మార్గంలో విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. విద్యుద్దీకరణ పనులు పూర్తవ్వడం కూడా షటిల్ రైలు సర్వీసులను ప్రవేశపెట్టేందుకు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా నందలూరు రైల్వేస్టేషన్లో ఉన్న లోకోషెడ్‌ను అభివృద్ధిపరచడంవల్ల కూడా ఈ షటిల్ సర్వీసుల మరమ్మతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం నందలూరు-అరక్కోణం మధ్య ప్యాసింజర్ నడుస్తున్నా షటిల్ సర్వీసు ఉంటే మరింత ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంది. కనుక రేణిగుంట-గుంతకల్ మార్గంలో విద్యుత్‌తో నడిచే షటిల్ రైలు సర్వీసులు నడిపేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని తెలుస్తుంది. కనుక ఇప్పటికైనా ఇక్కడి పార్లమెంటు సభ్యులు షటిల్ రైలు సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు గైకొనాల్సి ఉంది. కనీసం షటిల్ రైలు సర్వీసులు ఈ మార్గంలో నడిచేలా చర్యలు తీసుకుంటే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం రేణిగుంట-గుంతకల్ మార్గంలో తగినన్ని రైళ్లు లేని కారణంగా ప్రయాణీకులు ఎక్కువగా బస్సులను అశ్రయించాల్సి వస్తుంది. షటిల్ రైలు సర్వీసులు రావడం వల్ల ఈ ప్రాంత ప్రయాణీకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడమే గాక, రైలు ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు మెరుగువుతాయి. ఈ ప్రాంతంలో రైల్వేశాఖ అభివృద్ధికి జరుగుతున్న కృషి నామమాత్రంగా ఉన్నందున కొత్త రైళ్ళ రాకకు అనువుగా రైల్వే బడ్జెట్ రాకముందే జిల్లాకు చెందిన ఎంపిలు, రాజ్యసభ సభ్యులు గట్టిగా కృషి చేసి కనీసం షటిల్ సర్వీసులు జిల్లాకు మంజూరయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ప్రయాణిస్తున్న రైళ్ల సంఖ్య సర్కార్ ఇతర ప్రాంతాలతో చూస్తే 40 శాతం కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణంగా దశబ్దాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు రైల్వే సమస్యల పరిష్కారంలో చూపిన నిర్లక్ష్యవైఖరే కారణంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లోనైనా కొత్తరైళ్ళను ఈ మార్గంలో ప్రవేశపెట్టేందుకు రాయలసీమకు చెందిన పార్లమెంటు సభ్యుల సహకారంతో రాజంపేట పార్లమెంటు సభ్యుడు గట్టిగా కృషి చేయాల్సిన అవసరముంది.