కడప

కరవు మండలాల ప్రకటనపై రైతుల అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 22: ల జిల్లాలోని 50 మండలాల్లో 32 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వర్షపాతం నమోదును ప్రామాణికంగా తీసుకుని కరవు మండలాల జాబితాను జిల్లా అధికారులు రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. అయితే ఇటీవల జిల్లా మొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటిస్తామన్న అధికారులు ప్రభుత్వం 32 మండలాలనే కరవుమండలాలుగా ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌సీజన్‌లో భాగంగా జూన్, జూలై నెలల్లో చుట్టపుచూపు తరహాలో వర్షాలు కురిసి కేవలం ఆ రెండుమాసాల్లో 250 నుంచి 350 మి.మీ.వర్షపాతం నమోదుచేశారు. వాస్తవంగా ఒక్కో మండలంలో కొన్ని ప్రాంతాలకే వర్షపాతం కురిసినా, ఆ మండలంలోని పలు గ్రామాల్లో వర్షపాతం నమోదుకాలేదు. అయితే రాష్ట్రప్రభుత్వం మండలాలవారీగా వర్షపాత నమోదును పరిశీలించి 32 మండలాల్లో మాత్రమే ఖరీఫ్‌లో అతితక్కువ శాతం వర్షం నమోదు అయినట్లు గుర్తించి కరవు మండలాలుగా ప్రకటించింది. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం నెలకొని రైతులు సాగుచేసిన పంటలన్నీ పంటదిగుబడి సమయంలో దాదాపు 2లక్షల ఎకరాల్లో పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఒకటిన్నర లక్షల ఎకరాల్లో మాత్రమే పంట దెబ్బతినిందని తమ నివేదికలో పేర్కొన్నారు. అలాగే పంట కోత ప్రయోగాల్లో కూడా వ్యవసాయశాఖ, చీఫ్‌ప్లానింగ్‌శాఖ, స్టాటిస్టికల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వేచేశారు. ఆ సర్వేల మేరకు సంబంధిత అధికారులు పంటల బీమా ఏజెన్సీలకు, రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. సంబంధితశాఖ అధికారులు నివేదికలుపక్కనబెట్టి వర్షపాత నమోదును పరిగణలోకి తీసుకుని జిల్లాలో 32 మండలాలను మాత్రమే కరవును ఎదుర్కొంటున్నాయని ప్రకటించింది. వాతావరణ శాస్తవ్రేత్తలు ఏడాది కాలం నుంచి ఈ ఏడాది సంపూర్ణంగా వర్షాలు కురుస్తాయని అధికమోతాను మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో వేరుశెనగ, కంది, మినుము, పెసలు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, పత్తి, పసుపు, వరి అధికారుల అంచనాలు మించి సాగుచేశారు. అయితే వాతావరణ అధికారులు ఇచ్చిన సమాచారానికి వర్షం కురిసిన సమయాల్లో తూర్పు పడమర , ఉత్తర -దక్షిణ వ్యత్యాసాలు కంటే అతితక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు వాతావరణ కేంద్రాల అధికారులు ప్రకటించిన విధంగా అధికారులపై నమ్మకంతో పంటలు సాగుచేసి పంటల దిగుబడి సమయానికి వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి దశాబ్దాలకాలంగా వరుస కరువులో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి మరోమారు కరువు జిల్లాలో కరాళ నృత్యం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కరవుమండలాల నివేదికలతో జిల్లా రైతాంగానికి ఇన్‌ఫుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా పథకం కానీ వర్తించే అవకాశాలు కన్పించడంలేదు. ఈ పరిస్థితుల్లో 32 కరవు మండలాలకే పంటల బీమా పథకం దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిగిలిన 18 మండలాల్లో కనుచూపుమేర ఆర్థికసాయం అందే పరిస్థితులు లేవు. ఇప్పటికే డిఆర్‌సి సమావేశంలో, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కరవు జిల్లాగా ప్రకటించాలని తీర్మాణాలు చేసి కూడా ఉపయోగం లేకుండాపోయింది. ప్రభుత్వం జిల్లా మొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేసులకు భయపడవద్దు

రైల్వేకోడూరు, అక్టోబర్ 22: రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు చురుకుగా పనిచేయాలని కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటానని, కేసుల గురించి ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి, వైకాపా నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలోం నియోజకవర్గ స్థాయి వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ వైకాపా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డీసీసీబి ఛైర్మెన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వైకాపా అధిష్టానం ఆదేశించిన మేరకు తాను కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, మన పార్టీకి సంబంధించిన ఎంపిటిసి సభ్యులందరూ నా విజయానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకుల నోర్లు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన విమర్శించారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నాయకులపై ప్రజా ప్రతినిధులపై అన్యాయంగా కేసులు పెట్టిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించి వచ్చి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి అమ్ముడుపోకుండా తన విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైకాపా నాయకులను అధికార పార్టీ టార్గెట్ చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. జిల్లా వ్యాపితంగా 800కు పైగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఓటర్లున్నారని, తన విజయానికి తప్పక కృషి చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితప్ప ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇప్పటికే కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపిలు పదవుల కోసం డబ్బుల కోసం పార్టీలు మారుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒకటి కూడా అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం తధ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు వారు ఆరోపించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని పుల్లంపేట మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అప్రజాస్వామికంగా ఎంపిపి స్థానాన్ని కైవసం చేసుకున్నంత మాత్రాన రానున్నది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనన్న సత్యాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా వైకాపా ఆశీస్సులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు, అటు స్థానిక సంస్థల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైల్వేకోడూరు జడ్పీటీసీ రాజేశ్వరి, వైకాపా నాయకులు శ్రీనివాసులురెడ్డి, నాగరాజు, విహెచ్ రమేష్, మందల నాగేంద్ర, సుకుమార్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు బాబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు చెన్నూరులో ఉచిత వైద్యశిబిరం

చెన్నూరు,అక్టోబర్ 22: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ టి.రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం చెన్నూరులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప పట్టణానికి చెందిన ఎముకలు, కీళ్లకుసంబంధించిన వ్యాధి నిపుణులు గోసుల శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తామన్నారు. మండలంలోని ప్రజలు ఎముకల సాంధ్రత ,కీళ్ల వ్యాధులు తదితర వాటికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రూ.3వేలు విలుగల ఎముకల సాంద్రత పరీక్షలు ఉచితంగా శిబిరంలో చేస్తామన్నారు. అలాగే ఎముకల భద్రత,మోకాళ్లకీళ్లమార్పిడిపై రోగులకు పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామన్నారు. 40సంవత్సరాలు పైబడి ఉన్న వారు శిబిరానికి రావాలని సూచించారు.

28న పెండ్లిమర్రి మండల సమావేశం

పెండ్లిమర్రి,అక్టోబర్ 22: ఈనెల 28న మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపిడివో మల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వాధికారులు వారికి సంబంధించిన నివేదికలను తయారుచేసుకుని మండల సమావేశానికి తప్పకుండా హజరుకావాలన్నారు.సమావేశానికి ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి హాజరౌతారన్నారు.
26న సికె.దినె్న మండల సర్వసభ్య సమావేశం

చింతకొమ్మదినె్న,అక్టోబర్ 22: ఈనెల 26న చింతకొమ్మదినె్న మండల సర్వసభ్య సమావేశం ఎంపిడివో సభాభవన్‌లో జరుగుతుందని ఎంపిడివో రామచంద్రారెడ్డి తెలిపారు. ఈసమావేశానికి మండల పరిధిలోని అధికారులందరూ పాల్గొనాలని ఆయన సూచించారు. అలాగే ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితరులు తప్పకుండా హాజరుకావాలన్నారు. మండల సమావేశంలో మండలానికి సంబంధించిన అభివృద్ధిపనులపై చర్చించాలని ఆయన తెలిపారు. ఈకార్యక్రమానికి తప్పకుండా మండల అధికారులు హాజరుకావాలన్నారు.

వరిలో తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలి

చెన్నూరు,అక్టోబర్ 22: వరిలో తెగుళ్లు నివారించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయాధికారి రమేష్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని రామనపల్లి, రాచినాయపల్లి, ముండ్లపల్లి, శివాల్‌పల్లెగ్రామాల్లో రైతులు సాగుచేసిన పంట పొలాలను వ్యవసాయాధికారి , సిబ్బంది పరీశీలించారు. రైతులతో వరి తెగుళ్లపై రైతులకు వివరించారు. వరి పొలాల్లో పాముపొడ తెగుళ్లు, ఆకుచుట్టుపురుగు ఎక్కువగా ఉందని ఈ పురుగుల నివారణకు తగిన మోతాదులో మందులు వాడటం వల్ల తెగుళ్లు నివారించవచ్చునన్నారు. అలాగే దోమపోటు తెగుళ్లునివారణకు కూడా తగినమోతాదులో మందులు పిచాకారి చేసినట్లయితే తెగుళ్లునివారించవచ్చునన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు మాధవి,సులోచన,శివశంకర్, సుబ్బనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.