కడప

24 నుంచి ఫొటో అండ్ వీడియోగ్రాఫర్ల ఐక్యతయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), అక్టోబర్ 22: ఈనెల 24వ తేది నుంచి 26వ తేది వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు మోటార్ సైకిళ్లతో ఐక్యతయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎపి ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ల రాష్ట్ర అద్యక్షుడు కె.చంద్రారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఐక్యతయాత్రకు అసోసియేషన్ రాష్ట్ర ప్రముఖులు మాదాల రమేష్ , శ్యామ్ తదితర నాయకులు హాజరౌతారన్నారు. ఈ ఐక్యతయాత్ర ద్వారా మన ఐక్యతను ప్రదర్శించడమేగాకుండా జిల్లాకు మన ద్వారా మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే 26వ తేది ఉదయం 11 గంటలకు స్థానిక ఉట్టికల్యాణ మండపంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ఐక్యత మహాసభ ఉంటుందన్నారు. సమావేశంలో మూర్తిబాబు, సురేష్, శాస్ర్తీస్యూడియో ప్రభాకర్‌రావు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ప్రొద్దుటూరు, అక్టోబర్ 22: భార్య మద్యానికి డబ్బు ఇవ్వలేదని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని రామేశ్వరంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే శనివారం స్థానిక రామేశ్వరంలో నివాసముంటున్న రఘు (45) అనే వ్యక్తి కార్పెంటర్ వృత్తితో జీవనాధారం సాగిస్తున్నాడు. కాగా గత కొనే్నళ్లుగా ఇతను మద్యానికి బానిసగా మారి వృత్తిని పక్కనపెట్టి సోమరిగా మారాడు. ప్రతిరోజూ మద్యం సేవించేందుకు భార్య భ్రమరాంబను డబ్బుల కోసం వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో శనివారం భార్యను డబ్బులు అడుగగా తాను డబ్బు ఇవ్వనని మొండికేయడంతో రఘు భార్యతో గొడవపడ్డాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని తెలుసుకున్న భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రఘును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని, తండ్రి మృతిచెందడంతో భార్యా, పిల్లలు అనాధలుగా మారాల్సి వచ్చిందని వారు రోదిస్తున్నారు. స్థానిక ఒన్‌టౌన్ ఎస్సై చిన్నపెద్దన్న కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

14 మంది కోడిపందెంరాయుళ్ల అరెస్టు
* మూడు కోళ్లు స్వాధీనం

గాలివీడు, అక్టోబర్ 22: మండలంలో చీమలచెరువుపల్లె గ్రామం కమలామర్రి వద్ద కొండలలో శుక్రవారం రాత్రి జరిగిన కోడిపందెంపై దాడి చేసి14 మంది కోడిపందెరాయుళ్లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఎస్ ఐ మంజునాధ తెలిపారు. శనివారం ఆయన పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ ఈ కోడిపందెం దాడుల్లో 3 కోడిపుంజులతో పాటు రూ.8,670 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ ఐ తెలియజేశారు. ఈ దాడులలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రాజంపేట ఎస్వీ నగర్‌లో చోరీ
* 10 తులాల బంగారు.. 15 తులాల వెండి చోరీ

రాజంపేట, అక్టోబర్ 22:రాజంపేట పట్టణం ఎస్వీనగర్‌లో జయరామయ్యనాయుడు అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ చోరీ జరిగింది. 3 రోజుల క్రితం వేరే ఊరికివెళ్ళి శనివారం వచ్చిచూడగా ఇంట్లో చోరీకి గురైన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కడప నుండి ప్రత్యేకంగా క్లూస్‌టీం వచ్చి చోరీకి గురైన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన సంఘటనా స్థలాన్ని రాజంపేట అర్బన్ సిఐ మోహన్‌క్రిష్ణతో పాటు ఎస్‌ఐ రెడ్డయ్యలు పరిశీలించారు.