కడప

నిత్య సాహిత్య కృషీవలుడు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), అక్టోబర్ 22: వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన డాక్టర్ జానమద్ధి హనుమచ్ఛాస్ర్తీ 1960లో కడప జిల్లాలో కాలుమోపిన ఆయన కడపను స్థిరనివాసం చేసుకున్నారు. నాటినుంచి తన వృత్తికీ, ప్రవృత్తికీ కడప కేంద్రస్థానమయ్యింది. ఐదు దశాబ్దాలుగా కడప జిల్లా సంస్కృతి వికాసానికి దోహదం చేశారు. జానమద్ధి వీధి బడిలో చదివి విలువలు పెంచుకున్నారు. జీవితమంతా రచనావ్యాసంలో తరించిన సాహితీ మూర్తి. రచనా వ్యాసంలో అలుపెరగని బ్రౌన్‌శాస్ర్తీ డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్ర్తీ. మొండిగోడల నుంచి మహాసౌధాన్ని రూపొందించి నిరంతర విజ్ఞానకేంద్రంగా బ్రౌన్ భాషా కేంద్రాన్ని ఆవిష్కరించేందుకు అవిరాళ కృషిచేసిన వ్యక్తి జానమద్ది. దీంతో సిపిబ్రౌన్ గ్రంథాలయం నిర్మాణానికి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి నగదు విరాళాలతోపాటు పుస్తకాలు కూడా విరాళాలుగా వచ్చిపడ్డాయి. దీంతో బ్రౌన్ గ్రంథాలయం కడపలో సరస్వతీ మందిరంగా వెలిసింది. సాహితీపిపాసతో 1973 నుంచి 1993 వరకు కడప జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. సాహిత్యం విస్తృతంగా పెరగాలన్న ఉద్దేశ్యంతో సాహితీ పీఠం నెలకొల్పారు. సాహితీ వికాసానికి తోడ్పడేవారికి, భాషాభివృద్ధికి కృషిచేసేవారికి తనకున్నంతలో ప్రోత్సాహం అందించేవారు. మాతృభాషను ప్రభుత్వం విస్మరిస్తోందని, విద్యావిధానంలో, పరిపాలనలో మాతృబాషకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన చెందేవారు. 254 సంవత్సరాల కిందట మన్రోపాలన మాతృభాషలో సాగించే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చేవారు. దాన్ని బ్రౌన్ ఆచరించిచూపారని జానమద్ధి కొనియాడేవారు. ప్రభుత్వాలు, అధికారులు ఆంగ్లబాష వ్యామోహంలో పడిపోయారని, ఈ పరిస్థితి మారాలని కోరుకునేవారు. అలాగే భాషా వికాసానికి కృషిచేసిన సిపి బ్రౌన్ జానమద్దికి స్పూర్తిదాతగా నిలిచారు. విద్యాసంస్థల్లో ప్రధానంగా పాఠ్య, ప్రణాళికల్లో సమూలమైన మార్పురావాలని కోరుకునేవారు. ప్రాధమిక పూర్తిగా తెలుగులో బోధించాలని, ఈసత్యం ప్రపంచబాష వేత్తలందరూ చాటిచెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన పడేవారు. మాతృబాషలో సంస్కృతి మిళితమై ఉంటుందని, తల్లిదండ్రులు ఆంగ్లబాష వ్యామోహంలో పడకూడదనేవారు. మాతృబాష దూరమైతే ఆత్మీయత, అనురాగం, మనజీవన పునాదులు దూరమై ఆర్థికమే రాజ్యమేలి మన పతనం మనమే తెచ్చుకుంటామేమోనని ఆందోళన వ్యక్తపరిచేవారు జానమద్ది. కుటుంబాలు మారి ఇల్లే సరస్వతీ నిలయంగా మారాలని కోరుకునే వారు. ముఖ్యంగా జానమద్ది సారస్వత సేవతోపాటు సామాజిక ధార్మిక సేవలు చేస్తుండేవారు. ఏ మతమైనా వారికి హితవే. అన్నివర్గాల వారూ ఆయనకు మిత్రులే. గతంలో దాగిన హితాన్ని అక్షర రూపంలో అందిస్తూ ఉంటారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశభక్తినీ, మంజూమియా మత సహనాన్నీ, మాక్డొలాల్డు హత్యపట్ల సానుభూతినీ జానమద్ది తెలియజేస్తారు. కడప నుంచి ఢిల్లీదాకా ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి దాకా సంస్థలు, వ్యక్తులు ఆయన్ను సత్కరించినవారే. జ్ఞానపీఠ పురస్కారగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి శాస్ర్తీని 3బ్రౌన్ శాస్ర్తీ2 అని కితాబిచ్చారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్‌తో సత్కరించింది. గ్రంధాలయ సేవకు గుర్తింపుగా అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు అందుకున్నారు. తనలో గ్రంధాలయోద్యమ బీజాలు నాటిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు రుణం తీర్చుకుంటూ ఆయన పేర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు.

యాజమాన్య పద్ధతులపై శిక్షణ
సుండుపల్లె, అక్టోబర్ 22: యాజమాన్య పద్ధతులపై శిక్షణా కార్యక్రమాన్ని ఏవో పవన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమగ్ర పోషక పద్ధతులపై మండలంలోని జి.రెడ్డివారిపల్లెలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రబీలో వేరుశనగ దుక్కిలో ఎకరాకు 18 కేజీల యూరియా, వంద కేజీల సూపర్‌ను 32 కేజీలు వేసి మొదటి తవ్వకమప్పుడు 200 కేజీల జిప్సంను వాడితే అధిక దిగుబడి పొందవచ్చునని ఆయన తెలిపారు. అలాగే రైతుల కోసం 50 శాతం సబ్సిడీతో జిప్సమ్, జింకు, బోరాన్‌ను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.

నేడు ఉచిత వైద్యశిబిరం

రాయచోటి, అక్టోబర్ 22: రోటరీక్లబ్ ఆధ్వర్యంలో కొత్తపల్లెలోని జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్ నందు ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు క్యాంపు ఛైర్మన్ మహమ్మద్‌హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయిక్రిష్ణ, డాక్టర్ నిసార్‌అహమ్మద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ రెడ్డన్న, డాక్టర్ రాజీవ్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ వైద్యశిబిరంలో అన్ని విధాల జబ్బులకు ఉచితంగా చూడబడునని, తగు మోతాదులో మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఖాదర్‌బాష, ఎస్ ఎండీ షఫి, ట్రెజరర్ కూనా బాలాజి, అసిస్టెంట్ గవర్నర్ పబ్బిశెట్టి సురేష్‌కుమార్, జిల్లా అధికారులు కూనా క్రిష్ణదేవరాయలు, సయ్యద్ రియాజుద్దీన్, షేక్ మహమ్మద్‌హుస్సేన్, దేవకి సురేష్‌కుమార్, ఎస్‌కె హుస్సేన్ తదితరులు పిలుపునిచ్చారు.

27న మండల పరిషత్ సమావేశం

గాలివీడు, అక్టోబర్ 22: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 27న మండల పరిషత్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటసుబ్బయ్య తెలిపారు. ఎంపీపీ బండి చిన్నరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరుకావాల్సిందిగా ఆయన సూచించారు.

వరి పంటను పరిశీలించిన ఏవో

సంబేపల్లె, అక్టోబర్ 22: మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె గ్రామంలోని సుద్దలవాండ్లపల్లె, ముదినేనివాండ్లపల్లెలలో సుమారు 50 ఎకరాలలో సాగు చేసిన వరి పంటను సంబేపల్లె మండల వ్యవసాయాధికారి రమేష్‌బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో కలిసి వరిపైరును పరిశీలించి వరిపైరులో కాలిబాట పద్ధతి ఉపయోగించడం వలన దోమపోటు నివారించవచ్చన్నారు. అంతేకాకుండా వరి పంటకు సోకు తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారులు సూచించిన విధంగా మందులను పిచికారీ చేయాలన్నారు. ఎక్కువ మోతాదులో రసాయనాలు వాడటం వలన కూడా పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ముస్లిం పర్సనల్‌లాలో జోక్యం వద్దు

రాయచోటి, అక్టోబర్ 22: 1937 నుంచి అమల్లో ఉన్న ముస్లిం పర్సనల్‌లా స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న యూనిఫాం కోడ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు షాహి జామియా మసీదు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చెప్పారు. ఈ మేరకు మసీదు కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 41 మసీదులలో శుక్ర, శనివారాలలో సుమారు 45 వేల మంది ముస్లింల సంతకాలు సేకరించి ముస్లిం పర్సనల్‌లాలో ప్రభుత్వ జోక్యం వద్దంటూ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సంతకాల సేకరణ ద్వారా ముస్లింల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ సంతకాల సేకరణలో 20 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్కాజీ, మసీదు కమిటీ మెంబర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నేడు బాడీ బిల్డింగ్ పోటీలు

రాయచోటి, అక్టోబర్ 22: స్థానిక డైట్ స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి రెండవ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్-2016 పోటీలను నిర్వహించనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేష్, యూనుస్‌బాషలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ రమేష్‌రెడ్డి, మునిసిపల్ ఛైర్‌పర్సన్, నియోజకవర్గ టీడీపీ నాయకులు సుగవాసి ప్రసాద్‌బాబులు హాజరవుతున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుండి ఈ పోటీలకు ప్రజలు హాజరై పోటీలను తిలకించాలన్నారు.

2016 ప్రపంచ కబడ్డీలో భారత్ విజయంతో
క్రీడాభిమానుల సంబరాలు

రాజంపేట, అక్టోబర్ 22:2016వ సంవత్సరం ప్రపంచ కబడ్డీ పోటీల్లో శనివారం రాత్రి భారతదేశం ఘన విజయం సాధించడంతో రాజంపేటలో క్రీడాభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచ కబడ్డీ క్రీడాపోటీల్లో ఇరాన్‌పై భారత్ విజయం సాధించిన వెంటనే వీధుల్లోకి వచ్చి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. యువత కేరింతలు కొడుతూ బాణాసంచా పేల్చారు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మొదటిదశలో భారత్ ఇరాన్ కంటే వెనుకబడి ఉండడంతో నిరాశకు గురైన క్రీడాభిమానులు, ఆ తరువాత భారత్ ఊపందుకొని ఇరాన్‌ను మట్టికరిపించిన వైనాన్ని అభిమానులు ఆనందపరవశులయ్యారు. భారత్ 38, ఇరాన్ 29 పాయింట్లు ఈ ఫైనల్ మ్యాచ్‌లో పొందగా 9 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ గెలుపులో నితిన్‌తోమర్, అజయ్‌ఠాకూరు కీలకపాత్ర పోషించారు. రైడింగ్‌లో అజయ్‌ఠాకూర్ 10 పాయింట్లు సాధించడం జరిగింది. కాగా వరుసగా మూడు మార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ ఇప్పటి వరకు 8 మార్లు ప్రపంచకప్‌ను కబడ్డీ క్రీడలో విజయం సాధించడం జరిగింది. మొత్తానికి ఇన్నాళ్ళూ క్రికెట్ క్రీడపైనే అధికంగా క్రీడాభిమానులు మక్కువ చూపుతూ వచ్చారు. తాజాగా కబడ్డీ క్రీడపై కూడా క్రీడాభిమానులు అధికంగా మక్కువ చూపుతుండడం విశేషం. ఈ నేపధ్యంలో కబడ్డీలో ప్రపంచకప్ విజేతగా మరోమారు విజయం సాధించడంతో క్రీడాభిమానులు కేకలు, కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మొత్తానికి కబడ్డీలో మరోమారు ప్రపంచంలో తనకు తానే సాటి అని భారత్ కీలక విజయంతో నిరూపించుకున్నట్లైంది. ప్రపంచకప్ ఫైనల్‌లోకి భారత్ ప్రవేశించినప్పటి నుండి ఉద్వేగంతో గడిపిన క్రీడాభిమానులు భారత్ విజయం సాధించడంతో సంతోషాన్ని కుటుంబ సభ్యులతోనే కాకుండా, సన్నిహితులతో కూడా పంచుకోవడం జరిగింది.