కడప

రైతులకు సకాలంలో విత్తనాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, అక్టోబర్ 28: రైతులకు వ్యవసాయ కార్యాలయాలు, గోడౌన్ల చుట్టూ తిప్పకుండా విత్తనాలను సకాలంలో ఇవ్వాలని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో విత్తన గోడౌన్‌ను పరిశీలించారు. అలాగే వ్యవసాయాధికారి శ్రీవాణితో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు గోడౌన్‌కు వచ్చిన స్టాక్, రైతులకు పంపిణీ అయిన విత్తనాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. విత్తనాల పంపిణీ కార్యక్రమం ఆలస్యంగా జరుగుతున్నట్లు రైతులు తమ దృష్టికి తెచ్చారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలను సకాలంలో పంపిణీ చేస్తే రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కొందరు రైతులకు సెల్‌ఫోన్లు లేవని, అలాగే వేలిముద్రలు సరిగా పడనటువంటి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వ్యవసాయాధికారి శ్రీవాణికి ఆయన సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.