కడప

చాచానెహ్రూను ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, నవంబర్ 14: భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ప్రకటించి జరుపుకోవడం ఆనందదాయకమని నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మండలి ఉపాధ్యక్షుడు ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం బాలల దినోత్సవం పురష్కరించుకొని స్థానిక నారాయణ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి బాలలే రేపటి దేశపౌరులని, బాల బలాకలు జాతీయ సంపద అన్నారు. అలాగే నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. తల్లిదండ్రుల తరువాత ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. విద్యార్థులను క్రమశిక్షణ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఉపాధ్యాయులదేనన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని సతీష్‌రెడ్డి అభినందించారు. అంతకు మునుపు పట్టణంలో శ్రీనివాస పాఠశాల విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చాచా నెహ్రూ చిత్రపటాన్ని తీసుకొని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.