కడప

సమస్యల నిలయం సొంఠంవారిపల్లె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, డిసెంబర్ 5: సమస్యలు సొంఠంవారిపల్లెలో కొలువుతీరాయి. కొన్ని సంవత్సరాలుగా వీధిదీపాలు వెలగడం లేదు. సొంఠంవారిపల్లెలో ప్రధాన రహదారి ఒకటి అయితే మరో నాలుగు వీధులు ఉన్నాయి. ఏ ఒక్క వీధిలోనూ సిమెంట్‌రోడ్డు కనపడదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అత్తారింటికి వచ్చినట్లు వెళ్తుంటారే కానీ ఈ దృశ్యాలు వారి కంటపడవు. వారు ప్రచారాలకే సొంఠంవారిపల్లె ముఖం చూస్తారు. చీకటి పడితే ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు పలు పథకాల కింద లక్షల రూపాయలు విడుదల అవుతున్నాయి. ఆ నిధులు ఎందుకు, ఎలా ఖర్చు పెడుతున్నారో అధికారులకే తెలియాలి. అయితే ప్రజల కనీస అవసరాలు మాత్రం తీరడం లేదు. మండలమంతా రోడ్డు వేస్తున్నారు. కానీ సొంఠంవారిపల్లెను మాత్రం మరచిపోయారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు సమస్యలు పరిష్కరిస్తాం, రోడ్లు వేయిస్తాం అని ప్రజల ముందు గొప్పలు చెబుతున్నారు కానీ పనులెక్కడ అని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి వచ్చినా ఫలితం శూన్యం. ఎక్కడ వేస్తే మాకేంటి మాకు రావాల్సింది పది శాతం కమిషన్ మాకు చేరుతుందనే ధీమా అధికారుల్లో పాతుకుపోయిందతి. మండలంలో అధికార పార్టీ నాయకులు పనులు చేసినా ప్రతిపక్ష పార్టీ నాయకులు పనులు చేసినా సామాన్యులు చేసినా మాకేంటి మాకు రావాల్సిన మామూళ్లు మాకొస్తే చాలు ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలితే ప్రజల సమస్యల సంగతి ఏమిటని వందలాది ప్రశ్నలు పట్టించుకునే వారెవరని మండల స్థాయిలో భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు ఎలాగైనా పనిచేయండి మాకు తెలియదు మీకు బిల్లులు చేస్తాం మా జేబులు నింపండని అధికారులు కాంట్రాక్టర్లకు చెబుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకొని అధికారులు, నాయకులు స్పందించి సొంఠంవారిపల్లెకు మహర్దశ కల్పిస్తే ప్రజలకు ప్రభుత్వంపై, అధికారులపై నమ్మకం కలిగించవచ్చని గ్రామస్థులతో పాటు మండలంలోని పలువురు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఏమాత్రం స్పందిస్తారో వేచిచూద్దాం.

సోలార్‌కు భూములిచ్చేందుకు
రైతులందరూ సుముఖం
గాలివీడు, డిసెంబర్ 5: మండలంలోని తూముకుంట గ్రామంలో ఏర్పాటు కానున్న సోలార్ పవర్ ప్లాంటుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని నాయునివారిపల్లె, బలిజపల్లె రైతులు సోమవారం ప్రజావాణిలో రైతు రామమోహన్‌నాయుడు ఆధ్వర్యంలో తహశీల్దార్ భవానీకి వినతిపత్రం సమర్పించారు. కొందరు రైతులు అనవసరంగా భూములివ్వమని చెబుతున్నారని, ఇలాంటి అవాస్తవాలను అధికారులు నమ్మవద్దని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టు అభివృద్ధి కార్యక్రమాలను కొందరు అడ్డుకోవడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలపారు. ఇలాంటి వదంతులు వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడే ప్రమాదముందని, తాము సంయుక్తంగా సోలార్‌కు భూములిస్తామన్నారు.