కడప

నగదురహిత గ్రామంగా యామవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దనూరు, డిసెంబర్ 9: జిల్లాలోనే మొదటిసారిగా సిండికేట్‌బ్యాంక్ దత్తత తీసుకున్న యామవరం గ్రామాన్ని బ్యాంక్ ఆధ్వర్యంలో నగదురహిత గ్రామంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేయడం జరిగిందని కలెక్టర్ కెవి.సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని యామవరం గ్రామంలో శుక్రవారం సిండికేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న నగదురహిత లావాదేవీలపై నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమన్నారు. మారుతున్న కలానికి అనుగుణంగా అందరం ఆన్‌లైన్ ద్వారానే రూపేకార్డుల ద్వారా నగదురహిత మార్పిడి చేసుకోవాలన్నారు. ఈ విధంగా చేసుకోవడం వలన నల్లధనాన్ని నిరోదించడం సులభతరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో నగదురహితంగా సరుకులను పంపిణీచేస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్‌ను సిఎం చంద్రబాబునాయుడు ఇవ్వడం జరుగుతోందని, నియోజకవర్గంలో దేవగుడి తర్వాత అన్నివిధాలా అభివృద్ధిచెందిన గ్రామం యామవరమేనన్నారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా దేవగుడి ట్రస్టు సహకరిస్తుందన్నారు. ముద్దనూరు మండలానికి తాగునీటిని అందించే గండికోట ప్రాజెక్టులోనున్న సిపిడబ్ల్యూ స్కీమ్‌కు ప్రపంచబ్యాంక్ నిధుల నుండి రూ.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డు, సొంత ఇల్లు లేనివారు వెంటనే వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం ఎపి సిండికేట్‌బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ గ్రామంలో 1336 ఖాతాలున్నాయని, అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రూపే కార్డుల ద్వారా నగదుమార్పిడి చేసుకోవచ్చునన్నారు. రేషన్‌షాపుల నుండి ప్రైవేట్ నిత్యావసర వస్తువుల దుకాణాల వరకు ఇ-పాస్ యంత్రాలు ఏర్పాటుచేస్తారన్నారు. బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎపి సిండికేట్ బ్యాంక్ బెంగుళూరుకు చెందిన ఫీల్డ్ మేనేజర్ ఎస్‌వి.శర్మ, అనంతపురం పిఎస్‌సిడి మోహన్‌రెడ్డి, అనంతపురం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశీర్వాదం, మండల ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.