కడప

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 23: పశ్చిమ జిల్లాలలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేషన్, కడపలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని, వైకాపా అభ్యర్థులు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూస్తారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘంటాపథంగా చెప్పారు. శుక్రవారం నగరంలోని రోడ్లు భవనాలశాఖ అతిధిగృహంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల పరిశీలకులు దొరబాబు, జిల్లా నాయకులు, ఆపార్టీ జిల్లాఅధ్యక్షుడు ఆర్.శ్రీనివాసురెడ్డి (వాసు) అధ్యక్షతన ఎన్నికల వ్యూహంపై సమీక్షించి అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్భ్రావృద్ధిని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలకు పాల్పడి సిబిఐ, ఇడి కేసులతో పీకల్లోతు కూరుకుపోయి 16మాసాలు జైల్లో వుండి అనంతరం జగన్ బయటకు వచ్చి పశ్చాత్తాప పడకుండా తమ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూన్నారన్నారు. జైలులో ఉండి ఆయన అక్రమాస్తులు ఇడి స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో నైతిక బాధ్యతగా భావించి పార్టీలోని ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని, కేవలం పదవీ వ్యామోహంతో ప్రాంతాలవారీగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. తనపై కూడా ఎమ్మెల్యే గోవర్దన్‌రెడ్డితో ఆరోపణలు చేయించారని గుర్తు చేశారు. వారికి దమ్ము, ధైర్యం, రోషం ఉన్నట్లయితే ఎన్ని ఎంక్వైయిరీలు చేయించినా భయపడే ప్రసక్తేలేదని, ఎలాంటి విచారణలకైనా సిద్దమేనని సవాల్ విసిరారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని, రాజ్యాంగ విలువలు గౌరవించరని, జగన్ కుటుంబ చరిత్ర రాష్ట్రప్రజలందరికీ బాగా తెలుసునని వారు ధ్వజమెత్తారు. రాష్టవ్రిభజన అనంతరం అభివృద్ధి, సంక్షేమం, నూతన రాష్టర్రాజధాని నిర్మాణంతో సతమతవౌతున్న చంద్రబాబునాయుడు రోజుకు 18గంటలు పనిచేస్తున్నారన్నారు. నూతన సంస్కరణలు దేశంలో బాబునే ఆదర్శమని, బాబు విమర్శించే అర్హత అవినీతి జగన్మోహన్‌రెడ్డికి లేదన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సొంత జిల్లాలోనే ఆయన పార్టీలోని ముగ్గురు ఎమ్మెల్సీలు పత్తావుండరని, 2019 ఎన్నికల నాటికి వైపిసి మూతపడకతప్పదని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, వరదరాజులురెడ్డి, ఆర్.రమేష్‌రెడ్డి, కె.విజయమ్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య, రాష్టన్రాయకులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, హరిప్రసాద్, సిఎం సురేష్‌నాయుడు, దుర్గాప్రసాద్,పార్టీ కార్యాలయ కార్యదర్శి చింతం శివారెడ్డి (పేర్లశివారెడ్డి), వాసు పిఏ ధర్మారెడ్డి పాల్గొన్నారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు సహకరించాలి

కడప,డిసెంబర్ 23: బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు, స్వచ్చంధ సంస్థలు సహకరించాలని జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు జస్టిస్ డి.మురుగేశన్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ కెవి సత్యనారాయణ, ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, జెసి శే్వత, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. అనంతరం మురుగేశన్ మాట్లాడుతూ మానవహక్కుల కమిషన్ 1993లో ఏర్పడి దేశవ్యాప్తంగా వెనుకబడివున్న 28జిల్లాలను కేంద్రం గుర్తించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఈప్రాంతాల్లో కమిషన్ పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మానవహక్కుల పరిరక్షణకు సహకరిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20జిల్లాల్లో ఈ కమిషన్ పర్యటించిందని , ఏపిలో కడప జిల్లాలో 21వ జిల్లాగా పర్యటించామన్నారు. వైద్య, విద్యారంగంలో ఇతర వెనుకబడిన జిల్లాలకంటే కడప జిల్లా అభివృద్ధిదిశలో ఉందని ప్రసంశించారు. సేవారంగంలో