కడప

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఫిబ్రవరి 2: పల్లెల్లో, కాలనీల్లో నీటి ఎద్దడి లేకుండా వెం టనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.వి.సత్యనారాయణ అన్నారు. గురువారం రాజంపేట స్ర్తిశక్తి భవనంలో ఏర్పాటుచేసిన రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల క్లస్టర్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ క్రింద శానిటేషన్ కార్యక్రమాలు పెద్దగా చేపట్టాలని ఇప్పటికే కొన్ని గ్రామాలను ఓడిఎఫ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాలు కూడా ఓడిఎఫ్‌గా గుర్తించుటకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు నీటి సమస్య ఉంటే వెంటనే గుర్తించి మా దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా నీటిలభ్యత లేని గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అందుకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో శ్మశాన వాటికలకు కాంపౌండ్‌వాల్, బోరు, షెడ్ నిర్మించుటకు రూ.10 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని, జిల్లాలో 1000 శ్మశాన వాటికలకు నిధులు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 400 శ్మశానాలకు మాత్రమే నిధులు మంజూరు చేయడం జరిగిందని, మండల అభివృద్ధి అధికారులు ఇంకనూ మిగిలిపోయిన గ్రామాలలో శ్మశాన వాటికలకు స్థలాలు ఉండి ప్రతిపాదనలు పంపనివాటిని గుర్తించి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేసి రెండు రోజులలో పంపాలన్నారు. గ్రామాలలో సిసి రోడ్లు నిర్మించుటకు ప్రభుత్వం 50శా తం నిధులు మంజూరు చేసిందని, మిగిలిన నిధులు పంచాయతీ నుండి కాని, స్వచ్ఛంధ సంస్థలు ఎవ్వరైనా ముందుకు వస్తే అటువంటి వాటికి ప్రతిపాదనలు పంపితే ఆమోదించడం జరుగుతుందని, ఇంకనూ గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు లేకున్నచో అటువంటి గ్రామాలను గుర్తించి ప్రతిపాదనలు పంపితే ఒకొక్క గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షల వరకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అందు కు సంబంధించిన ప్రతిపాదనలు సంబంధిత మండల ప్రత్యేక అధికారి ద్వారా పంపాలన్నారు. ఇకపై అన్ని పంచాయతీలలో ఈ- పంచాయతీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అందుకుగాను ప్రతి పంచాయతీకి రెండు కంప్యూటర్లు మంజూ రు చేయడం జరుగుతుందని, ఆ గ్రామానికి సంబంధించి మొత్తం సమాచారాన్ని ఈ- పంచాయతీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ఇసుకను ప్రభుత్వం నోటిఫైడ్‌చేసిన రీచ్‌లలోనే తీసుకోవాలని నోటిఫైడ్ చేయని రీచ్‌లలో ఇసుక తీసుకోరాదని, గ్రామాల్లో కొత్త అంగన్‌వాడీ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే ప్రతిపాదనలు సంబంధిత ఐసిడిఎస్ అధికారుల ద్వారా పంపాలని, సరైన స్థలం ఉంటే అంగన్‌వాడీ భవనాలకు కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని, అంతేకాకుండా సెల్‌ఫోన్ ద్వారా నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకుల ద్వారా మంజూరు చేసే రుణాల ఎంపికలో తప్పకుండా బ్యాంక్ అధికారులు ఉండాలని, ఎంపికలో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా జాబితా రూపొందించి బ్యాంకులకు పంపాలన్నారు. ఈ సమావేశంలో వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, రాజంపేట ఆర్డీఓ వీరబ్రహ్మం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ సంజీవరావు, ఇఇ ఇషాన్‌బాషా, రాజంపేట, రైల్వేకోడూరు క్లస్టర్లకు చెందిన ఎపిఎంలు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.