కడప

పరిశోధనల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 28: పరిశోధనలపట్ల జిజ్ఞాస కలిగివుంటే దేశంలో శాస్తస్రాంకేతిక పరిశోధనలు చేపట్టేందుకు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. మంగళవారం యోగివేమన విశ్వవిద్యాలయంలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర పరిశోధనపై దృష్టి పెట్టాలన్నారు. శాస్తప్రరిశోధనల కారణంగా ప్రజల సౌభాగ్యం పెరిగేలా ఉండాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై నేడు పరిశోధనలు మరింతగా జరగాలన్నారు. మానవ మనుగడ పర్యావరణంపై ఆధారపడివుందని, భూమి నాలుగు బిలియన్ సంవత్సరాలు క్రితం ఆవిర్భవించిందని, 2లక్షల సంవత్సరాల క్రితం మానవ పరిణామం జరిగినట్లు శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయన్నారు. మానవులు పరిణామ క్రమంలో విలాస వంతమైన జీవన ప్రక్రియకు అలవాటు పడటం వల్ల పర్యావరణానికి ఎనలేని నష్టం జరిగిందన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ దుష్ప్రభావం వల్ల అకాలవర్షాలు, కరవు కాటకాలు ఏర్పడుతున్నాయన్నారు. సరైన వర్షపాతం లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. గతంలో యుద్ధాలు సంపదకోసం జరిగాయని భవిష్యత్‌లో యుద్ధాలు నీటి కోసం జరుగుతాయన్నారు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి వివిధ రంగాల్లో జరిగినప్పటికీ మానవాభివృద్ధికి అవసరమైన బయోటెక్నాలజిలో విస్తృతమైన పరిశోధనలు దేశంలో చేపట్టాల్సివుందన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రభుత్వ శాస్తస్రాంకేతిక మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏడాది నోబుల్ ఫ్రైజ్ గ్రహీత డాక్టర్ సివి రామన్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 28న మార్చి 1వ తేదీల్లో నేషనల్ సైన్స్‌డే ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. శాస్తస్రాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికే సైన్స్ డే నిర్వహిస్తున్నామని, హరిత విప్లవం, శే్వత విప్లవం, అంతరిక్ష విప్లవం మొదలైన శాస్త్ర సాంకేతిక విజయాల గురించి ఆయన వివరించారు. ఫైబర్ ఆప్టికల్స్ వల్ల సమాచార రంగంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. వైకల్య సమస్యలు అధికమించే క్రమంలో జరుగుతున్న పరిశోధనలు గొప్ప విజయాలు సాధించాయన్నారు. రాయలసీమ కరవు పరిస్థితులు అధిగమించే విధంగా భూ విజ్ఞాన జీవ సాంకేతిక, వృక్షశాస్త్ర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో భూగర్భ సంపదపై అవగాహన కల్పించడమే గాక దాన్ని ప్రజోపయోగం చేస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా రూపొందించిన బుక్ ఆఫ్ ఆబ్‌స్ట్రాక్స్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఆచార్య కృష్ణారెడ్డి, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కె.సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపాల్ ఆచార్య జయరామిరెడ్డి, రిజిస్ట్రార్ నజీర్ అహ్మద్, విశ్వవిద్యాలయం బోధన బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు. తొలుత వ్యాయామశాఖ నూతనంగా ఏర్పాటుచేసిన రైఫిల్ షూటింగ్ ప్రాంగణాన్ని ఉపకులపతి ఆచార్య రామచంద్రారెడ్డితో కలసి కలెక్టర్ ప్రారంభించారు.

పాఠశాలల అభివృద్ధికి కృషి
సిద్దవటం,్ఫబ్రవరి 28:పాఠశాలల యాజమాన్య సభ్యులుగా ఎంపికైన వారు పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య అన్నారు. సిద్దవటం జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన ఎస్‌ఎంసి సభ్యుల శిక్షణ తరగతులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఎస్‌ఎంసి సభ్యుల బాధ్యతలపై శిక్షణ తరగతులు ముగిశాయన్నారు. మండలంలోని జడ్పీ ఉన్నతపాఠశాల, టక్కోలు ఉన్నతపాఠశాలలో జరిగే ఎస్‌ఎంసి సభ్యుల శిక్షణ తరగతులు తనిఖీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న చేయూతను పేద విద్యార్థులకు తెలియపరచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసి సభ్యులు బలోపేతం చేయాలన్నారు. చదువుకుంటే వచ్చే లాభాలు, చదువు గొప్పతనం గురించి శిక్షణ తరగతుల్లో వివరించామన్నారు. పాఠశాలల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా మంజూరుచేసే నిధులు అలా ఎలా వినియోగించుకోవాలో శిక్షణ రూపంలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిధులు ఏఏ పనులకు వినియోగించాలో ఆయా పనులకే వినియోగించాల్సివుంటుందని తెలియక తప్పుచేసి జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. చెక్కుల మీద ఎస్‌ఎంసి చైర్మన్లు సంతకాలు చేసే సమయంలో అవగాహనతో సంతకాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిబాబు, జడ్పీ యుపి పాఠశాల ప్రధానోపాద్యాయుడు వెంకటసుబ్బారెడ్డి, పాఠశాల చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.