కడప

జగన్ దూకుడుకు కళ్లెం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 1: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దూకుడుకు కళ్లెం వేసి కడప జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని టిడిపి అధిష్ఠానం ఇప్పటినుంచే కరసత్తు చేపట్టింది. ఇందుకు నియోజకవర్గాల వారీగా నేతల పనితీరు, బలాబలాలపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. జగన్ సొంత జిల్లాలో తెలుగుదేశంపార్టీ పాగావేసేందుకు ప్రత్యేకించి హైకమాండ్ ధూతగా కడప పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్‌గా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని తరచు జిల్లాకు పంపుతున్నారు. చంద్రమోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రోడ్ల భవనాల అతిధిగృహానికి చేరుకుని అప్పటికే జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి, మరికొంతమంది నేతలు మకాం వేసివున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డితోపాటు ఇతర నాయకులు జిల్లాలో రాజకీయ పరిస్థితులను గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులే అధికంగా గెలవడం, రెండు పార్లమెంట్ స్థానాలు కోల్పోవడంపై నేతలు ఆత్మపరిశీలన చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లు వారి బలాలు, వారికున్న మైండ్‌గేమ్స్‌పై మంత్రులు, నాయకులు ఆరా తీశారు. 2019 ఎన్నికలే ధ్యేయంగా ఏజెండా పెట్టుకుని నేతలు ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్పీడ్‌కు కళ్లెంవేసేందుకు చంద్రమోహన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌లు, విప్‌మేడా వెంకటమల్లికార్జునరెడ్డి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన నేతలు ఆధిపత్యపోరున్న నియోజకవర్గాల నేతల్లో మార్పు తీసుకురావడానికి చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అధిష్ఠానానికి నివేదించి అధిష్ఠానం ఇచ్చే సలహాలపై మంత్రులు ఇరువురు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు, గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేసిన నేతలమధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటన్నింటిని చక్కదిద్దేందుకు మంత్రులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లు పనితీరు, వర్గవిభేధాలు, ఆధిపత్యపోరు, గ్రూపులతో అభివృద్ధికి సహకరించని నేతల జాబితాలు కూడా తయారుచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రతిపక్షనేతకు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అవకాశం కల్గించకుండా నేతలందర్నీ ఏకతాటిపై నడిపించేందుకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. దీంతో వెంటనే చర్యలు తీసుకునేందుకు మంత్రులు వేగవంతం చేస్తున్నారు. వీరితోపాటు కేంద్రమాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, మాజీ మంత్రులు పి.బ్రహ్మయ్య, డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషా, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), ఎమ్మెల్సీ బిటెక్ రవి, ఎమ్మెల్యే టి.జయరాములు, జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, రాష్టక్రార్యదర్శులు ఎస్.గోవర్ధన్‌రెడ్డి, సిఎం సురేష్‌నాయుడు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.