కడప

వెబ్ కౌనె్సలింగ్‌పై అనుమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, మే 1: వేసవి సెలవులకు ముందే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం చాలా కసరత్తుచేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అభిప్రాయాలను తీసుకుంది. అయితే సంఘాలతో చర్చలు జరిపినా ప్రక్రియపై ఇప్పటికీ సరైనస్పష్టత రాలేదు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన నెలకొంది. వేసవి సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడపాల్సిన ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ మనశ్శాంతిని లేకుండా చేస్తోంది. ప్రభుత్వం ఏ క్షణంలో బదిలీలు, పాఠశాలల రేషనలైజేషన్‌కు సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటుందోనన్న ఆందోళన ఉపాధ్యాయులను అయోమయంలో పడేసింది. మొత్తంమీద ఉపాధ్యాయుల బదిలీలు, సమస్యలపై మూడడుగులు ముందుకు ఆరడగులు వెనక్కు అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉండడంతో ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బదిలీలు, రేషనలైజేషన్‌పై నెలకొన్న అయోమయం మంగళవారం నాడు భేటీ అయ్యే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగింపు పలుకుతుందన్న ఆశాభావంతో ఉపాధ్యాయ వర్గం ఉంది. మంగళవారం జరిగే రాష్ట్ర కేబినెట్‌లో బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి కీలక అంశాలు చర్చించి వాటిపై విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు
ప్రతిభ ఆధారిత పాయింట్ల ఆధారంగా బదిలీలు చేపట్టకూడదు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలి. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఏ వసతులు కల్పించకుండా పేపర్ల మూల్యాంకనం చేపట్టడం అసాధ్యం. నూతన విధానంపై ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ కల్పించాలి. సౌకర్యాలు కల్పించకపోతే సిసిఈ విధానాన్ని రద్దుపరచాలి. రూ.398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు జీతాలు, పాతబకాయిలు ఒకేసారి చెల్లించి, వారికి కూడా వేతన విధానాన్ని ఏర్పాటు చేయాలి. 2008 హామీ పత్రాలతో నియామకమైన ఉపాధ్యాయుల వేతన వ్యత్యాసాన్ని తొలగించాలి వంటి పలు అంశాలతో కూడిన డిమాండ్లను ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచాయి.
పాయింట్ల విధానంలో స్పష్టత లేదు:
బి.గురుకుమార్, ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి, జమ్మలమడుగు.
ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో సరైన స్పష్టత లేదు. ప్రక్రియలో పలు అంశాల్లో ఉపాధ్యాయులకు ఆందోళనచెందే విధంగా ఉన్నాయి. తీసుకునే నిర్ణయాల్లో స్పష్టతతో ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఉండాలి.

కార్మిక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దవటం,మే 1: కర్మాగారాల్లో పనిచేసే ప్రతి కార్మికునికి ఆయా యాజమాన్యాలు కొన్ని ప్రయోజనాలు కల్పించాల్సిందిగాచట్టాలు ఉన్నాయని ఆయా చట్టాలను కార్మికులు సద్వినియోగించుకోవాలని సిద్దవటం జూనియర్ సివిల్ జడ్జి అతిఖ్ అహ్మద్ పేర్కొన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయం ఆవరణలో సోమవారం మేడే సందర్భంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ సమాజంలో అన్ని కుల, వర్గాల ప్రజలు భాగస్వాములన్నారు. ప్రతి వ్యవస్థలో కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయని అందుకోత్సవం ఒక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. అలాగే మేడే అనేది కార్మిక దినోత్సవాన్ని చాటిచెబుతుందన్నారు. ప్రతి కర్మాగారంలో పనిచేసే కార్మికునికి కనీస వేతనంతోపాటు హక్కులు ఉంటాయన్నారు. కార్మికుల హక్కులపై అవగాహన కల్పించేందుకు న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు యాజమాన్యాలు అనేక సౌకర్యాలు, వౌలిక సదుపాయాలు కల్పించాల్సివుంటుందన్నారు. కార్మికులకు ఏవైనా సమస్యలుంటే లోక్ అదాలత్‌లో అర్జీరూపంలో సమర్పిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్మికులు, మహిళలు, బాలలు, వృద్ధులకు రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయని వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సునీల్‌కుమార్, రవికుమార్, సుధారాణి, నాగభూషణం, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది బాబురామ్, మార్టీనా, సిద్దవటం పోలీసులు కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.