కడప

తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 21కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 1: జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదని సంబంధిత అధికారులు, సంబంధిత సిబ్బంది గ్రామాలకు వెళ్లి నీటి సమస్య పరిష్కరించాలని, ప్రస్తుతం రూ.21కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డిలు సోమవారం ఆర్‌అండ్‌బిలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. జాయింట్‌కలెక్టర్ శే్వత తెవతియతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన, సిరికల్చర్, ఆర్‌డబ్లుఎస్, జడ్పీ సంబంధిత అధికారులతోపాటు మిగిలిన అధికారులతో సమీక్షించి వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.31కోట్లతో ప్రతిపాదనలు పంపామని వాటిలో తక్షణం రూ.21కోట్లు విడుదల చేసిందన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు, పంటలు రక్షించేందుకు ప్రభుత్వం సిధ్ధంగా ఉందని నిధులకొరత లేదని సంబంధిత అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రజలు, రైతుల కష్టాలు తెలుసుకుని పరిష్కరించాలని వారిని ఆదేశించారు. కొత్త బోర్లు వేసుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి నీరు రవాణాకు ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందని వారు పేర్కొన్నారు. క్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి ట్యాంకర్ల ద్వారానే నీరు సరఫరా చేస్తామని మిగిలిన ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు భూగర్భజలాలు లభించని పక్షంలో వ్యవసాయబోర్ల నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అధికారులు ఆ పథకాలు అమలుచేయాలని వారు సూచించారు. రాష్టవ్రిభజనతో రాష్ట్రానికి ఆర్థిక కష్టాలున్నా జిల్లాలో వాటన్నింటినీ అధికమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు కావాల్సినవి ఎన్నికోట్లరూపాయలైనా విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు గుర్తుచేశారు. ఇక చీనీ, నిమ్మ, దానిమ్మ, అరటి తోటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. పకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కృతనిశ్చయంతో ఉందని వారు తెలిపారు. జిల్లాకు చెందిన ప్రతిపక్షనేతలు అభివృద్ధి నిరోధకులుగా తయారై పనీ పాటలేని కారణంగావారు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వాటి అమలుపై జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. జిల్లా వారీగా సాగులో ఉన్న పంటలను, నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలు, ఉద్యానవన పరిస్థితులను మంత్రులు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు మంత్రులు ఆదివారం రాత్రి 11గంటల పై నుంచి జిల్లా పరిస్థితులపై చర్చించుకుని సోమవారం సమీక్షలో అధికారులు, విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.