కడప

ఆర్టీపీపీకి బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రగుంట్ల,మే 1: రాయలసీమ థర్మల్‌పవర్ ప్రాజెక్టుకు 2017 సంవత్సరానికి గాను బెస్ట్‌మేనేజ్‌మెంట్ అవార్డు లభించింది. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడ కనె్వన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ చేతులమీదుగా ఆర్టీపీపీ సిఇఓ శ్రీరాములు ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద మెమెంటోతోపాటు ముఖ్యమంత్రి సిఇకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీపీపీ కార్మిక అధికారి తిరుమలరావు హాజరయ్యారు. రాయలసీమ జోన్‌లో ఆర్టీపీపీకి ఈ అవార్డు రావడం ఇదే ప్రధమం. ఈప్రాజెక్టు స్థాపించి 25సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపధ్యంలో ప్రభుత్వం ద్వారా యాజమాన్యానికి అవార్డు రావడం పట్ల సిఇ శ్రీరాములు సంస్థలో ఉద్యోగుల్లో పండుగవాతావరణం నెలకొంది. ఆర్టీపీపీ మొదటి నుంచి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల నిర్వహణతోపాటు సాంఘిక కార్యక్రమాలు, చట్టబద్దమైన పథకాలు అందించినందుకు గాను ఈ అవార్డు రావడం జరిగిందని ఆర్టీపీపీ యాజమాన్యంతోపాటు కార్మికవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ మేనేజ్‌మెంట్ అవార్డు రావడానికి సహకరించిన జెన్కో చైర్మన్ అజైయ్‌జైన్, ఎండి విజయానంద్‌తోపాటు డైరెక్టర్లకు ఆర్టీపీపి యాజమాన్యం కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. అలాగే అవార్డుకు సహకరించిన కార్మికశాఖ అధికారులకు కూడా ఆర్టీపీపీ అధికారులు తమ హర్షం తెలిపారు. పలువురు యూనియన్ నాయకులు, అసోసియేషన్ నాయకులు అవార్డు ఆర్టీపిపికి రావడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీపీపీలో పనిచేస్తున్న రామకృష్ణ అకౌంట్‌సెక్షన్ మేడే సందర్భంగా రాష్టస్థ్రాయిలో జరిగిన క్రీడల పోటీల్లో రన్నింగ్ విభాగంలో ద్వితీయస్థానాన్ని సంపాదించినందుకు గాను సీఎం చంద్రబాబునాయుడు, కార్మికశాఖ మంత్రి సత్యనారాయణలు సన్మానించారు.

జిల్లాలో మోస్తరు వర్షం

కడప,మే 1: జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో వేసవి నుంచి సంబంధిత ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించింది. జిల్లాలో చక్రాయపేటలో 36.4మి.మి, పెద్దముడియంలో 29.4, రాజుపాలెంలో 27.4, కొండాపురంలో 26.6, చిన్నమండెంలో 19.4మి.మి.వర్షం కురిసింది. సుండుపల్లె, గాలివీడు, ఒంటిమిట్ట, అట్లూరు, సిద్దవటం, బ్రహ్మంగారిమఠం, చిట్వేలి, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, పెనగలూరు, నందలూరు, రాజంపేట మండలాల్లో చుక్కవర్షం కురవలేదు. మిగిలిన మండలాల్లో ఓ మోస్తరులో వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో ఈదురుగాలులు జోరుగా వీచడంతో పండ్లతోటలు నేలకొరిగాయి. బొప్పాయి, అరటికి కొంతమేరకు నష్టం వాటిల్లింది. రెండుమాసాలుగా ఎండలు, వేడితో అలమటిస్తున్న ప్రజలకు, పశువులకు జిల్లాలోని 17 మండలాల్లో కొంతమేరకు ఊరటనిచ్చింది. అరకొర సాగుచేసుకున్న వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, వివిధ పండ్లతోటలకు కొంతమేరకు ఈ వర్షం ఊరటనిచ్చింది. పసుపు ఆరబెట్టేందుకు పొలాలపై ఉన్న పసుపురైతుకు కొంతమేరకు నష్టం వాటిల్లింది. మొత్తం మీద ఈవర్షం ప్రజలకు, రైతులకు మేలు చేకూర్చింది. రెండు నెలలుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం కురిసిన ఈ వర్షం వల్ల మండల వాసులకు వేడి నుండి ఒకింత ఉపశమనం కలిగింది. మండలంలోని కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న కుంటలు, చెక్‌డ్యాంల్లోకి నీరు చేరింది. దీంతో పశువులకు, పక్షులకు ఈ వర్షం ఎంతో ఉపయోగమని చెప్పవచ్చు.