కడప

ఘనంగా మొల్ల జయంతి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,మార్చి 13: మొల్ల జయంతి సందర్భంగా మంగళవారం కడపలోని మొల్ల విగ్రహానికి మొల్ల సాహితీపీఠం సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్లసాహితీపీఠం ప్రధానకార్యదర్శి చిన్నయ్య మాట్లాడుతూ మొల్ల బద్వేలు తాలూకాలోని పెద్దగోపవరం మండలంలో జన్మించి ఎలాంటి చదువు లేకుండానే మల్లేశ్వరి రూపంలో తల్లిదండ్రుల ఆశీర్వాదంతో రచనలు రూపొందించారన్నారు. అనంతరం మొల్ల సాహితీపీఠం ఉపాధ్యక్షుడు మునెయ్య మాట్లాడుతూ అందరి ఆడపడుచు కవయిత్రి మొల్ల అని ఆమె కడప జిల్లాలో జన్మించడం గౌరవప్రదంగా ఉందన్నారు. మొల్లసాహితీపీఠం గౌరవాధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ ఈమె జన్మించిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరారు. పీఠం అధ్యక్షుడు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ గోపవరం గ్రామాన్ని మండల పర్యాటక కేంద్రంగా మార్చాలని మండలాన్ని మొల్ల మండలంగా పేరు మార్చాలని కోరారు. కార్యక్రమంలో శాలివాహన సంఘం జిల్లాప్రధానకార్యదర్శి రామాంజులు, మహిళాకార్యదర్శి శివపార్వతి, తెలుగు కళానేత్ర అధ్యక్షురాలు, మొల్ల పురస్కార వేత్త డా.కోడూరు సుజన, బీజేపీ నగర అధ్యక్షుడు ఎరికలప్ప, సంఘం నాయకులు నర్సయ్య, డా.సుబ్బరాయుడు, నాగభూషణం, అశోక్‌కుమార్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.