కడప

కోటిరెడ్డి సర్కిల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 14: కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్, డివైఎఫ్‌ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కడపలోని ఏడురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. దీంతో ఈప్రాంతంలోని వాహన రాకపోకలు స్థంభించిపోయాయి. గంటపాటు వాహనాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి సంఘాలను అరెస్టుచేసి స్టేషన్లకు తరలించాయి. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి కావాలనే కేంద్రం అన్యాయం చేసిందని విరుచుకుపడ్డారు. రాయలసీమ నాలుగుజిల్లాల్లో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉందని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీ సీమ జిల్లాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. కరువుకు నిలయంగా ఉన్న కడప జిల్లాలో నాలుగేళ్లకాలంలో ఒక్కపరిశ్రమ కూడా ఏర్పాటుచేయలేదని, ఇక్కడికి ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, వేలాది మందికి జీవనోపాధి దక్కుతుంది అంటూ ప్రకటనలు గుప్పించడంతోనే ప్రభుత్వం నిరుద్యోగులకు ఆశలు రేపిందేతప్ప, ఉద్యోగావకాశాలు కల్పించలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాచేస్తే రాయలసీమ నాలుగు జిల్లాలకు అందుబాటులో ఉన్న కడప జిల్లాలో అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్న నేపధ్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయడం అసాధ్యమేనంటూ కేంద్రం ప్రకటించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేంద్రం తన వైఖరి మార్చుకుని రాష్టవ్రిభజనలో ఇచ్చిన హామీమేరకు రాజ్యాంగబద్దంగా హక్కు కలిగివున్న కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ ఏర్పాటుచేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో ఆపార్టీకి ప్రజలు బుద్దిచెప్పే పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. కాగా విద్యార్థులు భారీస్థాయిలో మానవహారానికి పూనుకోవడం, వారిని తొలగించేందుకు పెద్దఎత్తున పోలీసులు మోహరించాల్సివచ్చింది. ఈసందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు విద్యార్థులను ,యువజన సంఘాల వారిని అరెస్టుచేసి రిమ్స్‌పోలీసుస్టేషన్‌కు తరలించారు.

ముమ్మాటికి మోదీ రాష్ట్రాన్ని అన్యాయం చేశారు
కడప, జూన్ 14: నాలుగేళ్లుగా రాష్ట్రంలోని విభజన చట్టానికి అనుకూలంగా కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుచేస్తామని నమ్మించిన బీజేపీ పాలకులు మోసం చేశారని తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి బి.హరిప్రసాద్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం కడపలోని కళాక్షేత్రం నుండి ర్యాలీగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వచ్చారు. ఈసందర్భంగా కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన వసతులు కల్పిస్తామని, అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటుచేస్తామని రాష్ట్రప్రభుత్వం పదే పదే కేంద్రానికి విన్నవించిందన్నారు. కేవలం మెకాన్ అనే సంస్థను ఏర్పాటుచేసి కడప జిల్లాకు పంపారని, ఈ సంస్థ అన్ని పరిశీలించి ఉక్కుపరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయంటూ ప్రకటనలు కూడా చేసిందన్నారు. రేపో మాపో పరిశ్రమ ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కడపకు వస్తున్నారని బీజేపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారని ధ్వజమెత్తారు. అంతా బీజేపీ కృషి చేస్తోందని ప్రజలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ఆపార్టీ నేతలు ఘనంగా ప్రచారం చేశారని , చివరకు రాష్ట్రంమీద ఉన్న కక్షతో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటుకు మోకాలడ్డిందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు సరైన సమయంలో బుద్దిచెబుతారని హెచ్చరించారు.