కడప

మాట వినని అధికారులకు బదిలీలు ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 29: జిల్లావ్యాప్తంగా తమ మాటవినని మండలస్థాయి అధికారులను బదిలీ చేయాలంటూ అధికార పార్టీ నేతలు హైకమాండ్‌పై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి నేతల చర్యలతో కొందరు అధికారులు విసిగిపోయి తాము బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మండలస్థాయిలో రెవెన్యూ, పోలీసు, ఎంపిడివోలను టార్గెట్‌చేసుకుని వారిని బదిలీ చేయించేందుకు వత్తిడి తెస్తున్నారు. ఇకపోతే వైకాపా పాలనలో ఉన్న స్థానిక సంస్థల్లో టిడిపి నేతలు చెప్పిన పనులు చేయడం లేదంటూ అధికారులందర్నీ మూకుమ్మడిగా మార్చాలని పట్టుబడుతున్నారు. జిల్లాలో అధికసంఖ్యలో జెడ్పిటిసిలు, మండల పరిషత్‌లు, గ్రామపంచాయతీ సర్పంచ్‌లు వైకాపావారే అధిక సంఖ్యలో ఉన్నారు. జన్మభూమి కమిటీలు మండలస్థాయి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించాలని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అధికారపార్టీలో కూడా మండలస్థాయిలో రెండు,మూడు గ్రూపులుండటంతో ఏంచేయాలో తెలియక అధికారులు తలపట్టుకొని కూర్చున్నారు. మరోవైపు జిల్లాస్థాయి అధికారులు చట్టప్రకారం పనిచేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇక గ్రామకార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులపై కూడా అధికారపార్టీ నేతలు వత్తిడి చేస్తుండటంతో వారు సైతం బదిలీపై వెళుతామని బహిరంగంగా చెబుతున్నారు. మరో రెండు,మూడు వారాల్లో భారీగా మండలస్థాయి అధికారుల బదిలీకి కసరత్తు సాగుతోంది.