కడప

తుంగభద్ర, ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో భారీ వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌కు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలవల్ల కృష్ణానది పరుగులు పెడుతోంది. దీంతో ఆ రాష్ట్రాల పరిధిలోఉన్న తుంగభద్ర, ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు వరద నీటితో హోరెత్తుతున్నాయి. దీంతో దిగువ ప్రాంతాలైన జూరాల నుండి శ్రీశైలానికి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో కడప జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టు చివరి ప్రాంతాల్లోని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో జూరాలకు నీరు వదిలివేశారు. తుంగభ్రద్ర డ్యామ్ నుండి బుధవారం 11 గేట్లు ఎత్తివేసి 8.508 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆలమట్టిలో 1.53లక్షల క్యూసెక్కుల నీరు ఉండటంతో దిగువకు 1.53.258 క్యూసెక్కుల నీరు వదిలివేశారు. ఆలమట్టి దిగువనున్న నారాయణపూర్‌లో కూడా భారీ వరదనీరు చేరుతోంది. నారాయణపూర్ సామర్థ్యం 37.6టిఎంసీలు కాగా 33 టీఎంసీలు నీరు నిలకడగా ఉంది. ఎగువప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటిని జూరాలకు వదిలారు. జూరాలాకు 5వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 13.405 క్యూసెక్కులు నీటిని వదలుతున్నారు. అలాగే తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 100.8టిఎంసీలు కాగా ప్రస్తుతం 93టీఎంసీలు ఉంది. తుంగభద్రలో కూడా బుధవారం నుండే గేట్లు ఎత్తివేశారు. ఇందువల్ల శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరేఅవకాశాలు కనిపిస్తున్నాయి. రెండుమూడురోజుల్లో అన్ని ప్రాజెక్టుల నుండి జూరాలమీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరదనీరు విడుదలపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు సమాచారం తెలుసుకుంటున్నారు. వారం పదిరోజుల్లో శ్రీశైలానికి భారీ వరదనీరు రావచ్చునని కిందిస్థాయి పరిధిలోని కేసీ కెనాల్ ఆయకట్టుతోపాటు మైలవరం, గండికోట ప్రాజెక్టులకు ఈ నీరు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీంతో ప్రతిరోజు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలపై వస్తున్న సమాచారంతో రైతులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దీంతో జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టుకూడా భారీ తాగునీరు అందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రధానంగా కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో 90వేల ఎకరాల ఆయకట్టు ప్రతి యేడాది ఖరీఫ్‌లో సాగుకానుండగా, రబీలో సైతం పంటలు వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గత యేడాది ఈప్రాంత రైతులు రెండుకార్ల పంటలను సాగుచేసుకున్నారు. ఖరీఫ్, రబీకి అనుకూలంగా నీరు వదిలారు. ప్రస్తుతం కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో దువ్వూరు, మైదుకూరు, చాపాడు, రాజుపాలెం, జమ్మలమడుగు, ఖాజీపేట, చెన్నూరు,కడప, వల్లూరు మండలాల్లో ఆయకట్టు ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంత రైతులు భూములను దున్ని ఎరువులుతోలి, పంటల సాగుకు సన్నద్దం చేస్తున్నారు. గత యేడాది జూలైలో భారీ వర్షాలు కురిశాయి. జూన్ మొదటివారానికి నార్లుపోసుకుని నాటడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వర్షాలు పడకపోవడంతో రైతులు నారు పోసుకునేందుకు కూడా వీలులేకుండాపోయింది. వ్యవసాయశాఖ దాదాపు 42వేల క్వింటాళ్ల విత్తనాలు తెప్పించినప్పటికీ ఏ రూపంలో కూడా నారుపోసుకునే అవకాశం లేకుండాపోయింది. అక్కడక్కడ చెరువులు, వంకలు, వాగులు,కుంటలు ఉన్నా అవన్నీ ఎండిపోయాయి. బోర్లలో సైతం నీరు రావడంలేదు. దీంతో 90వేల ఎకరాల్లో పంటసాగు చేయాల్సివుండగా, కేవలం 2,500 ఎకరాలు మాత్రమే పంటవేశారు. అయితే శ్రీశైలానికి నీరువస్తే ఆగస్టు మొదటివారంలోనైనా వరినార్లు పోసుకుని నాట్లు వేసుకునే అవకాశాలున్నాయని రైతులు భావిస్తున్నారు. శ్రీశైలం నీటితోపాటు ఆగస్టులో వర్షాలు వస్తే పంటలసాగు సులభతరంగా ఉంటుందని, అయినప్పటికీ శ్రీశైలం నీటిపై రైతులు ఆశలు పెంచుకుని నీటి రాకకోసం ఎదురుచూస్తున్నారు.