కడప

కష్టజీవులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదుకూరు,ఆగస్టు 20:కష్టజీవులకు ప్రజాస్వామ్యంలో సామాజిక భాగస్వామ్యం కల్పించడమే తమపార్టీ లక్ష్యమని ,నిరంకుశ వైఖరి అవలంభిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు స్వస్తిచెప్పేందుకు వామపక్ష పార్టీలు కలిసివచ్చే పార్టీలతో ఒక మహాకూటమిని ఏర్పాటు చేయబోతోందని సీపీఐ రాష్టక్రార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఈమేరకు తమపార్టీ జాతీయస్థాయిలో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని, బీజేపీ , వైకాపా, టీడీపీ , కాంగ్రెస్ పార్టీలు మినహాయించి తమతో కలిసివచ్చే వామపక్షనేతలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. సీపీఐ 23వ జిల్లామహాసభలు పురస్కరించుకుని స్థానిక బద్వేలు రోడ్డులో ఏర్పాటు చేసిన కామ్రెడ్ చౌడం బాలయ్య ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన జిల్లా ప్రతినిధుల మహాసభకు ఏఐటియుసి రాష్టక్రార్యదర్శి జి.ఓబులేసుతో కలిసి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేశారు. మొదట వారు సీపీఐ పతాకావిష్కరణ చేసి మృతవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఇటీవల దేశంలో మృతిచెందిన ప్రముఖుల పేర్లను పేరుపేరున వెల్లడిస్తూ వారి ఆత్మకుశాంతి చేకూరాలని రెండునిమిషాలు వౌనం పాటించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీ, కార్పొరేట్ మీడియాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారని వారికి ప్రజాస్వామ్యం విలువల పట్ల కనీస పరిజ్ఞానం కూడా లేదన్నారు. ఏపీ విభజన హామీల అమలులో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఫలితంగా ఏపీ ప్రజలు తీవ్ర కష్టాలకు గురౌతున్నారన్నారు. విదేశాల్లో దాచిన నల్లడబ్బు వెలికితీయకపోగా మోదీ పాలనలో దేశంలోని బ్యాంకులను కార్పొరేటర్లు లక్షల కోట్లరూపాయలను కొల్లకొట్టారని దుయ్యబట్టారు. మైనింగ్ మాఫియా గాలిజనార్దనరెడ్డిని చేరదీసి కర్నాటక రాజకీయాలు శాసించాలని చూశారన్నారు. విభజన హామీలు అమలుచేయాలని మొదట ఆందోళనకు దిగింది తమపార్టీనేనన్నారు. రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దిగిపోవాలని ఓడించేందుకు ప్రజలు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యపరిచేందుకు ఆగస్టులో తమ పార్టీ ప్రతినిధులు బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. సెప్టెంబర్ 15న విజయవాడలో మహాగర్జన ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఏఐటియుసి రాష్టక్రార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ ప్రజాచైతన్యం కోసం గ్రామాల్లో తమపార్టీ బలోపేతం కోసం ప్రతి కామ్రెడ్ నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాకార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

కరవు ప్రాంతంలో సహాయకచర్యలు చేపట్టాలి
* జడ్పీచైర్మెన్ గూడూరు రవి
కమలాపురం, ఆగస్టు 20: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని జడ్పీచైర్మెన్ గూడూరు రవి కోరారు. ఆయన స్థానిక వైసీపీ కార్యాక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పూర్తిగా అందలేదని,బ్యాంకుల్లో కొత్తరుణాలు అందకపోగా రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంతో బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షణ చేస్తున్నారని అన్నారు. జిల్లాలో గత నాలుగేళ్లుగా రైతాంగం అతివృష్టి, అనావృష్టి వల్ల ఎదో ఒక విధంగా నష్టపోతున్నా రన్నారు. నష్టం జరిగినప్పుడల్లా ఆదుకుంటామని చెబుతున్నారే తప్ప రైతులకు సాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఉత్తహామీలు ఇవ్వడం సరికాదని, వాటిని నెరవేర్చెందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. గత మూడేళ్లుగా రైతులకు రావలసిన పంటలభీమా కూడా సక్రమంగా అందలేదని అన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారన్నారు. ప్రతి 5 ఏళ్లకొకమారు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని సూచించారు. ఇందువల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 80%పైగా రైతులు భూములు సాగుచేయలేదన్నారు. వర్షాబావ పరిస్థితుల దృష్ట్యా ఎన్నడూ లేని విధంగా ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం బ్యాంకురుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను అందచేయాలన్నారు. అలాగే ఈ ఏడాది జిల్లాలో అరకొరగా సాగుచేసిన వరిరైతులు నకిలీ విత్తనాలతో, నకిలీ ఎరువులతో పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి ఇందుకు పాల్పడ్డవారిపై కఠినచర్యలు తీసుకుని నష్టపోయిన రైతాంగానికి సాయం అందించాలని కోరారు. ఇందులో జిల్లా వైసీపీ రైతునేత ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.