కడప

ఇక గ్రామపంచాయతీలకు ఆన్‌లైన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 20: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు తీసుకురావడానికి జిల్లాయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఆన్‌లైన్ సేవల విధానంతో గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు వేగవంతంగా అందించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. లే ఔట్ల అనుమతుల్లో పారదర్శకతను పెంపొందించేందుకు ఆన్‌లైన్ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా దోహదపడతాయి. ప్రస్తుతం పంచాయతీల్లో పౌరసేవలకు అనుమతులు ఆన్‌లైన్ ద్వారా మంజూరు చేయడం అభివృద్ధికి ఆస్కారం లేకుండా సత్వరమే అందుబాటులోకి తీసుకురావడానికి ఆన్‌లైన్ సేవలు గ్రామప్రజలకు తోడ్పాటు ఇస్తుంది. ప్రభుత్వం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలకే పరిమితమైన ఆన్‌లైన్ అనుమతులు ఇక నుంచి గ్రామీణ స్థాయిలోని పంచాయతీల్లో కూడా అమలులోకి రానున్నాయి. రాష్టప్రంచాయతీ రాజ్‌శాఖ పంచాయతీల్లో అనుమతుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేసింది. ఈ వెబ్‌సైట్‌లో పౌరులకు అవసరమైన ఇండ్లస్థలాలకు అనుమతులు, లే ఔట్లు వంటి కోసం దరఖాస్తులు, కావాల్సిన పత్రాలు అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రజలకు కాలయాపన లేకుండా సత్వర సేవలు త్వరలోనే గ్రామాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆన్‌లైన్ నుంచి అనుమతులు మంజూరు చేయడమే పరిష్కారంగా పంచాయతీరాజ్‌శాఖ భావిస్తోంది. కొత్త సాఫ్ట్‌వేర్ వినియోగానికి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పంచాయతీల్లో ఆన్‌లైన్ అనుమతులు అమలుచేయనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు కాల వ్యవధి నిర్దేశించి, ఆలోపు ఇవ్వకపోతే అనుమతులు మంజూరైనట్లుగానే భావించాలని కొత్త విధానం స్పష్టంగా తెలుపుతోంది. ఇక పంచాయతీల్లో క్లస్టర్ కేంద్రాల్లో కంప్యూటర్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ లేకపోవడంతో ఆన్‌లైన్ విధానం ఎంతవరకు విజయవంతవౌతుందో వేచి చూడాల్సిందే. ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ఆన్‌లైన్ సేవలు అమలుకు పెద్ద ఆటంకంగా మారే అవకాశాలున్నాయని కొంతమంది పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఇంటర్నెట్‌పై అవగాహన లేకపోవడంతో ఎలాంటి పత్రాలకు అనుమతులు ఎలా పొందాలో తెలియకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. తొలుత ఈ సమస్యలన్నింటినీ అధిగమించాల్సివుంది. ఈ సమస్యలను నివారిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలమై ఆన్‌లైన్ సేవల ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.

స్మార్ట్ సిటీ అంటూ చెత్త సిటీగా మార్చారు
* ఆకేపాటి అమర్‌నాధరెడ్డి
రాజంపేట, ఆగస్టు 20:రాజంపేటను స్మార్ట్ సిటీగా చేస్తామంటూ చెత్త సిటీగా మార్చారని రాజంపేట పార్లమెంటరీ వైసీపీ ఇన్‌ఛార్జి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రాజంపేటలోని ఆకేపాటి భవన్‌లో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పడి ఉంటుందని, తీసేసే వారే లేరని, దీంతో ఎక్కడ చూసినా చెత్తతో దర్శనం ఇచ్చే పరిస్థితి పట్టణంలో కనిపిస్తుందన్నారు. మంగళవారం లోపు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్న చెత్తపై చర్యలు తీసుకోకుంటే వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆందోళనపై కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. రాజంపేట మున్సిపాలిటీలో పరిశుభ్రత కరవు కమీషన్ల కోసం పాకులాడుతున్న అధికారపార్టీ నేతలతో పాటు మున్సిపల్ కమీషనర్ పరిశుభ్రత పట్టించుకోవడం లేదని దుయ్యపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 50 నెలలు అయినా రాజంపేట మున్సిపాలిటీలో కనీసం ఒక అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. రాజంపేట పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పెరిగిపోతున్నాయని, గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజంపేట పట్టణంలో రాబోయేకాలంలో నీటి ఇబ్బంది ఉంటుందని ముందే గ్రహించి అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా రాజపంట మున్సిపాలిటీకి నీళ్లు అందించడం జరిగిందన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రికల్ క్రెమిటోరియం మొట్టమొదటిసారిగా రాజంపేటలోనే నిర్మించడం జరిగిందని, కానీ ఇంతవరకు ప్రారంభం చేయకపోవడం చాలా బాధాకరమన్నారు.