కడప

నవరత్నాలతో నవోదయం: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 21: వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టబోయే నవరత్న పథకాలతో నవోదయం కలుగుతుందని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండలంలోని శిబ్యాల గ్రామ పరిధిలోని శిబ్యాల కస్పా, నక్కలవరం, వైకుంఠరాచపల్లె, తొగటపల్లె, తురకపల్లి, కొత్తవాండ్లపల్లె, అన్నంరాజుగారిపల్లె, మల్లయ్యగుంటపల్లి, కుమ్మరపల్లి, హరిజనవాడ, సిద్దారెడ్డిగారిపల్లె, దళితవాడ, కొత్తవడ్డెపల్లె, గువ్వల హరిజనవాడ, పోలురెడ్డిగారిపల్లి, అనుంపల్లె, మంగళపల్లి, భోగ్యంపల్లి, గొల్లవాండ్లపల్లెలో సమర్థ నాయకత్వం కోసం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డి ఓ వైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మరోవైపు జగనన్న ప్రవేశపెట్టే నవరత్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. గ్రామంలోని ఏ పల్లెకు వెళ్లినా అందరి నోట ఇదే మాట వినిపించింది చంద్రబాబు అందరినీ మోసం చేశాడని, కరవు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని రైతన్నలు ఘాటుగా విమర్శించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మాట తప్పాడని ఈ ప్రాంత మహిళలు దుమ్మెత్తి పోశారు. పక్కా గృహాలు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలన్నీ ఒక వర్గం వారికే అందుతున్నాయంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తామన్న చంద్రబాబు నిరుద్యోగులను నయవంచన చేశాడని ఈ ప్రాంత నిరుద్యోగులు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అన్ని వర్గాల వారిని మోసం చేశాడన్నారు. జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు 45 సంవత్సరాల వయస్సు ఉన్న వారికే పెన్షన్లను ఇస్తామన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్న ఆశీర్వదించాలని ఆయన కోరారు. తొగటపల్లిలోని పొలం పనులలో ఉన్న మహిళా రైతులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్డిపల్లె వాసులు తాగునీటితో ఇబ్బంది పడుతున్నామంటూ ఆయన దృష్టికి తీసుకరావడంతో రీబోర్ వేయిస్తామని హామీ ఇచ్చారు.