కడప

రూ.77.25 కోట్లతో మైనార్టీ విద్యాలయాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, నవంబర్ 20: జిల్లాలో 2016-17, 2017-18లో మల్టీ సెక్టోరియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిధుల నుంచి ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధి కోసం సుమారు రూ.77.25 కోట్లతో పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు నిర్మించడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎం.రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాయచోటి పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ముస్లిం మైనార్టీ కళాశాల, పాఠశాల, వసతిగృహాల భవనాలు పరిశీలించారు. అలాగే నూతనంగా మంజూరైన ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2016-17లో జిల్లాలోని ప్రొద్దుటూరులో మైనార్టీల కోసం బాలుర వసతి గృహం కోసం రూ.2.10 కోట్లతో, బాలికల వసతి గృహం రూ.2కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. అలాగే ఫంక్షన్‌హాల్‌కు రూ.కోటి, బాల బాలికల గురుకుల పాఠశాలలకు మరో రూ.36 కోట్లు కేటాయించామన్నారు. దీంతో పాటు క్రిస్టియన్ మైనార్టీలకు ప్రార్థనా మందిరం కోసం రూ.69 లక్షలు, చర్చిల నిర్మాణం కోసం రూ.15 లక్షలు, అలాగే ప్రొద్దుటూరులో చర్చికి రూ.15 లక్షలు, జమ్మలమడుగులో చర్చి కోసం రూ.15 లక్షలు, దువ్వూరులో చర్చి కోసం రూ.15 లక్షలు మంజూరైందన్నారు. అలాగే అదనపు తరగతి గదుల కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయన్నారు. అలాగే రాయచోటిలో ఉర్దూ జూనియర్ కళాశాలకు రూ.1.99 కోట్లు, వంద పడకల వసతి గృహానికి రూ.2.10 కోట్లు, ప్రాథమిక పాఠశాల(రాయుడు కాలనీ)కి రూ.25 లక్షలు, అహమ్మద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు రూ.25 లక్షలు, లక్కిరెడ్డిపల్లె అదనపు తరగతి గదులకు రూ.10 లక్షలు, మడితాడు ప్రైమరీ పాఠశాలలో అదనపు తరగతి గదులు రూ.20 లక్షలు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. కడపలో ఉర్దూ బాలికల జూనియర్ కళాశాల కోసం రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దీంతో పాటు మరో రూ.25 కోట్ల నిధులు మైనార్టీల సంక్షేమం కోసం ప్రతిపాదనలు పంపిణీ చేసినట్లు చెప్పారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
* 120మందితో నాకాబందీ * డీఎస్పీ క్రిష్ణన్
జమ్మలమడుగు, నవంబర్ 20: మండలంలోని గొరిగెనూరు గ్రామంలో మంగళవారం ఉదయం డీఎస్పీ ఆధ్వర్యంలో 120మంది సిబ్బందితో నాకాబందీ నిర్వహించారు. పోలీసుల లిస్టులో సమస్మాత్మకంగా ఉన్న గొరిగెనూరు గ్రామంలోని వీధుల్లో పోలీసు తిరిగారు. అలాగే గ్రామంలోని పెద్దలను పిలిపించి గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అందరూ సహకరించాలని తెలిపారు. మారుతున్న సమాజంనకు అనుగుణంగా ఎవరూ ఎటువంటి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించకూడదన్నారు. ఎవరైనా హద్దులు మీరి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ క్రిష్ణన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సరైన అనుమతి పత్రాలు లేని 62 బైకులు, 2 ఆటోలు, 1 కారును పోలీసులు సీజ్ చేశారు. నాకాబందీలో అర్బన్, రూరల్ సీఐ శ్రీనివాసులు, ఉమామహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.