కడప

హోంగార్డుల సేవలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, డిసెంబర్ 6: జిల్లాలో పోలీసుశాఖతోపాటు వివిధ ప్రభుత్వశాఖల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సేవలు చిరస్మరణీయం, అభినందనీయమని ఎస్పీ అభిషేక్ మహంతి అన్నారు. గురువారం 56వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం పోలీసు పేరేడ్ మైదానంలో హోంగార్డులచే ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 1963లో పోలీసువ్యవస్థకు అనుసంధానం చేసేందుకు హోంగార్డు సంస్థ వాలంటరీ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటుచేసిందన్నారు. అన్నిరకాల విధులు నిర్వహిస్తూ పోలీసుశాఖకు సహాయ సహకారాలు అందిస్తున్న హోంగార్డులసేవలను ఆయన కొనియాడారు. దీర్ఘకాలికంగా ఉన్న హోంగార్డుల సమస్యలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. హోంగార్డుల కుటుంబాల భద్రతకు వారి భవిష్యత్‌కు జీవిత బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఏపీ ప్రభుత్వ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ పాలసీ, చంద్రన్న బీమా, మొండి బకాయిల పాలసీ, ప్రధాని ఆవాజ్ యోజన, గృహనిర్మాణ పథకం, వ్యక్తిగత ప్రమాద బీమా తదితర పథకాల గురించి హోంగార్డులు తెలుసుకుని లబ్దిపొందాలని హితవుపలికారు. విధుల్లో పోలీసులతో సమానంగా కష్టాలు ఛాలెంజ్‌గా తీసుకుని బాధ్యతతో హోంగార్డులు విధులు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు హోంగార్డుల కుటుంబ సభ్యులకు, వారి కుటుంబంలోని యువతీ యువకులకు దోహదపడే విధంగా పోలీసుశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. క్రమశిక్షణతో, అంకితభావంతో, బాధ్యతా యుతంగా హోంగార్డులు విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్పీ పరిపాలనా విభాగం ఏ.శ్రీనివాసరెడ్డి, అదనపు ఎస్పీ (ఆపరేషన్) లక్ష్మినారాయణ, ఏఆర్ డిఎస్పీలు, సివిల్ డిఎస్పీలు, ఆర్‌ఐవో, పోలీసు అధికారులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరంలో పాల్గొన్న హోంగార్డులు
హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హోంగార్డులు, పోలీసులు పోలీసు పేరేడ్ మైదానం నుంచి ర్యాలీని కొనసాగించి ఏడురోడ్లకూడలి, పాతరిమ్స్ సర్కిల్, క్రిస్టియన్ మీదుగా పోలీసు మైదానం చేరుకుంది. అనంతరం హోంగార్డులు రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. రక్తదానం చేయడంవల్ల ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చునని అదనపు ఎస్పీ శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. బ్యాండ్ మాస్టర్ బృందాన్ని అభినందించిన ఎస్పీ ..ఈకార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డా.షమీరా, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, ఆర్‌ఐవోలు, పోలీసు అధికారులు , పోలీసులు పాల్గొన్నారు.