కడప

పోలీసుల సంక్షేమం కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, డిసెంబర్ 14: పోలీసుల సంక్షేమం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని గాలివీడు మార్గంలో నూతనంగా అత్యాధునిక టెక్నాలజీతో రూ.1.42 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఆయనతో పాటు లా అండ్ ఆర్డర్ ఏడీజీ హరీష్‌గుప్తా, డీఐజీ నాగేంద్రకుమార్, జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి, ఓఎస్డీ( ఆపరేషన్) లక్ష్మీనారాయణ, పులివెందుల డీఎస్పీ నాగరాజలు పేర్కొన్నారు. ప్రారంభం అనంతరం పోలీస్‌స్టేషన్‌లో పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హోం మంత్రి చిన్నరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 3157 పోలీసు పోస్టులను భర్తీ చేసి వారికి శిక్షణ వారిని ఆయా పోలీస్‌స్టేషన్లకు పంపడం జరుగుతుందన్నారు. పోలీసులకు పదవీవిరమణ ఉంటుందని కాబట్టి ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. సమాజంలో కేసుల విషయంలో కూడా మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో అయితే ఆకలి కోసం దొంగతనాలు జరిగేవని, ప్రస్తుతం ఆకలి కాకుండా డబ్బే ధ్యేయంగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మోడల్ పోలీస్‌స్టేషన్లను నిర్మించడం జరుగుతున్నదన్నారు. ఎర్రచందనం, మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగులను నియంత్రణలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా జిల్లా అధికారులు పనితీరు భేష్ అని కొనియాడారు. పోలీసులకు పని ఒత్తిడి అధికంగా ఉన్న కారణంగా పోలీస్‌స్టేషన్‌ను మంచి వాతావరణంలో నిర్మించడం జరిగిందన్నారు. రాయచోటి పట్టణంలో ఇరుకురోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాయచోటిని త్వరలో సబ్‌డివిజన్ చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కొత్తగా శిక్షణ తీసుకున్న పోలీసులను కూడా ఈ ప్రాంతానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడక తాగేందుకు కూడా నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఇబ్బందులను అధిగమించి ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. ప్రజలు వలసలు పోకుండా ఉండేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడం జరిగిందన్నారు. రైతాంగానికి పశుగ్రాసం కొరతను కూడా తీర్చడం జరిగిందన్నారు.