కడప

చట్టాన్ని అందరూ గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాపాడు, జనవరి 19: సమాజంలో చట్టాలపై అందరూ గౌరవం పెంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. శనివారం చాపాడుకు సమీపాన సీబీఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా శిబిరానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో చట్టాలపై అవగాహన పెంచినప్పుడు నవ సమాజం మార్పు చెందగలదని అభిప్రాయం పడ్డారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పోలీసులు చట్టాలపై అవగాహన కల్గిస్తున్నారన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చి చట్ట పట్ల అవగాహన పెంచుకొని వాటి పనితీరును పెంచినప్పుడే అందరికీ సమాన న్యాయం జరగగలదన్నారు. ప్రభుత్వం చట్టంపై ఎన్నో రకాలుగా రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ప్రస్తుతం న్యాయ సలహాల కోసం సుప్రీం కోర్టు, హైకోర్టు సూచనల మేరకు న్యాయ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం 130 శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. అందరికీ పథకాలు అందినప్పుడే నిజమైన నవసమాజం ఏర్పడ గలదన్నారు. న్యాయ సేవ పట్ల మన హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సేవలు చేస్తుందన్నారు. నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలకు రుణాలు, ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, కాపు, బ్రాహ్మణ, ఇతరాత్ర ఈబీసీ కింద కార్పోరేషన్‌లు ఏర్పాటు చేసి అందరికీ రుణాలు అందిస్తుందన్నారు. ఆధరణ, ఎన్‌టి ఆర్ వైద్య సేవలు, చంద్రన్న భీమా, 12 రకాల పింఛన్లు ఏర్పాటు చేసి అర్హులందరికీ కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు 100 రోజులు పనిదినాలు కల్పిస్తే వాటిని 150 దినాలకు పెంచామన్నారు. వీలైతే 200 రోజులు కూడా ఉపాధి పనులు కల్పిస్తామని ఎవ్వరూ జిల్లాను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకూడదని ఆయన కోరారు. జిల్లా జడ్జీ శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో న్యాయ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజల పిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలాంటి వేదికల ద్వారా ప్రజల వద్దకే న్యాయ స్థానాలు, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందించ దగ్గ విషయం అన్నారు. ఎస్పీ మహంతి మాట్లాడుతూ పోలీసులు 24/7 దినాలు ప్రజల వద్దనే ఉంటూ భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. 100 డయల్ ద్వారా ప్రజల చెంతకే వెనువెంటనే పోలీసులు రావడం శుభసూచకం అన్నారు. రక్షణ కోసం బ్లూకోర్ట్, గ్రామ పోలీస్ ఆఫీసర్, రక్షిత టీం వంటి వాటి ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రావడం జరుగుతుందన్నారు. నవసమాజ అభివృద్దికి కృషి జరగాలంటే ప్రజలు, పోలీసులు మమేకమై స్నేహ భావంతో మెలిగినప్పుడే అభివృద్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.