కడప

నరకానికి దారి.. కడప-రేణిగుంట రహదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, మే 13: కడప రేణిగుంట హైవే మృత్యు మార్గంగా మారుతోంది. ఈ మార్గంలో ప్రమాదాలు జరగని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ నెల ప్రారంభం నుండి తీసుకున్నా పది మంది వరకు మరణించి ఉంటారు. ఈ మార్గంలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు హరి మంటున్నా సంబంధిత అధికారులు స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకున్నామని చేతులు దులుపుకుంటున్నారు తప్పితే, ప్రమాదాలు చోటుచేసుకునేందుకు కారణాలు ఏమిటి అన్న క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సరైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ హైవే మొత్తం రమారమి 125 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 125 కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు 81కి పైగా స్పీడ్ బ్రేకర్లు. దీంతో కడప-రేణిగుంట హైవేలో ప్రయాణం అంటేనే వాహన చోదకులు, ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. స్పీడు బ్రేకర్లు ఏర్పాటుచేసినంతమాత్రాన రోడ్డు ప్రమాదాలు జరగవని భావిస్తే సరికాదు. ముఖ్యంగా వాహనాలు అతివేగంగా వస్తున్నపుడు ఎదురె దురుగా ప్రయాణించకుండా రోడ్డు మద్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలనే సాంకేతికంగా అధికారులు, ఇంజనీర్లు ఆలోచించకుండా అనాలోచితంగా వ్యవహరించడమే ఇన్ని ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ హైవేలో వచ్చే గ్రామాల్లో రహదారిని రెండుగా విభజించి మధ్యలో కాంక్రీట్ డివైడర్లు వేయడం వల్ల రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనే పరిస్థితులుండవు. రెండు వైపులా ఒక్కో మీటరు వెడల్పు చేస్తే సరిపోతుంది. మిగతాచోట్ల మధ్యలో ఒక మీటర్ వెడల్పుతో డివైడర్ ఏర్పాటు చేసి రెండు వైపవులా ఒకో మీటర్ వెడల్పు పెంచినట్లైతే రాబోయే దశాబ్దకాలానికి సరిపడా సౌకర్యం కలగడమేకాక తక్కువ ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు మార్గం తయారవుతుంది. ప్రమాదాలు కూడా ఈ హైవేలో రెండు వాహనాలు డీకొనే ప్రమాదాలు తప్పించినట్లవుతుంది. స్పీడ్ బ్రేకర్ల సంఖ్యను కూడా బాగా తగ్గించేందుకు వీలు కలుగుతుంది. 2003వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ రహదారికి ఇంతవరకు రెన్యువల్స్ చేపట్టనందున ఆర్భాటంగా కోట్లాది రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఏ ముహూర్తంలో ఈ హైవేలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారో తెలియదు కాని అప్పటి నుండి వేల సంఖ్యలో ప్రాణాలు ప్రమాదాల్లో పోయాయి. అంతే ప్రమాదాలు నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏ మాత్రం ఈ హైవేలో ఉపయోగపడడం లేదన్నది వాస్తవం. కనుక ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని ఆర్ అండ్ బి శాఖ ప్రక్కన పెట్టడం వల్లే తరచూ ఈ హైవేలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్మప్పుడు మాత్రం ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలపై దృష్టి సారించనున్నట్టు ఆర్భాటంగా ప్రకటనలు చేయడం ఆ తరువాత పట్టించుకోకపోవడం షరామామూలు తంతుగా మారుతోంది. స్పీడుబ్రేకర్లు కారణంగా ఈ మార్గంలో తరచూ ప్రయాణించే డ్రైవర్లకు, ప్రయాణీకులు తీవ్ర అలసటకు గురవుతున్నారు. ఇక రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణీకులకు కుదుపుల కారణంగా నిద్రలేమితో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా వాహనాల జీవితకాలం దెబ్బతిని తరచూ మరమ్మతులు ఎదుర్కొనాల్సి వస్తుందని కూడా వాహన యజమానులు వాపోతున్నారు. కనుక ప్రమాదాల నివారణకు ఈ హైవేలో స్పీడ్ బ్రేకర్లతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాల్సి ఉంది. ఇప్పటికైనా మొదటి విడతగా ప్రమాదాల నివారణకు ప్రాధాన్యత ఇచ్చి హైవేలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీలుగా తక్కువ ఖర్చుతో నాలుగులైన్ల రహదారిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను శరవేగంగా పరిశీలించేందుకు సంబంధిత అధికారులు, ఇక్కడి ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు ఈ హైవేలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలను గుర్తెరిగి ప్రమాదాల నివారణకు, ప్రయాణీకుల సుఖ ప్రయాణానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈ హైవే నాలుగులైన్ల రహదారిగా మార్పు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు నిర్మించినట్టు చెబుతున్నా ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు 80శాతం పైగా రెండు వాహనాలు ఎదురెదురుగా డీకొనడం వల్ల, ఆగి ఉన్న వాహనాలను డీ కొనడం వల్లనో జరుగుతున్నాయి. పైగా స్పీడ్ బ్రేకర్లు నివాస ప్రాంతాల్లోనే అధికంగా ఉంటున్నాయి. అందువల్ల ప్రమాద నివారణకు ఇవి ఏ విధంగాను సహకరించవు. ప్రమాదాలు నివారించాలంటే స్పీడ్ బ్రేకర్ల వల్ల సాధ్యం అవుతుందనుకోవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. కనుక అప్పటివరకైనా మరెందరో ప్రాణాలు ఈ హైవేలో కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికారులు, ఇక్కడి ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరముంది.