కడప

తిరుమలేశుని తొలిగడప దేవుని కడప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్:‘‘కాదనకు నామాట కడపరాయ...నీకు గాదెబోసే వలపుల కడప రాయ’’....ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల వేంకటేశ్వరస్వామి తొలి గడపగా ప్రసిద్ధికెక్కిన కడప జిల్లాలోని దేవునికడపలో నెలవై వున్నది శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం... శ్రీలక్ష్మీవెంకటేశ్వరుడి దత్తత మండలాన్ని పాలించిన ప్రభువులేగాక ఉత్తర భారతదేశంలో ఎందరో రాజులు సేవించిన దాఖలాలున్నాయి. అతి పురాతనమైన దేవుని కడపలో దేవుని ప్రతిష్టించిన కృపాచార్యుల పేరుపై ఈ ప్రాంతానికి కడప మండలం అని పేరుకూడా వచ్చిందని చరిత్రకారులు చెపుతున్నారు. తిరుమలకు వెళ్ళే భక్తులు కాలిబాటలో దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించి అనంతరం తిరుమలవాసిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉండేది. 50 సంవత్సరాల క్రితం వరకు కడప జిల్లాలోని రైల్వేకోడూరు ప్రాంతం నుంచి తిరుమలకు గోగర్భంవరకు కాలిబాట వుండేది. పురాణాల ప్రకారం ముందుగా కడపకు హనుమత్ క్షేత్రమని పేరు. ద్వాపరయుగం ముందు కురుక్షేత్ర సంగ్రామం అనంతరం కలియుగ ప్రవేశం జరిగిందని భావించిన కృపాచార్యుల వారు దైవం శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటామని వింద్య పర్వతాల నుంచి కాలినడకన బయలుదేరారు. అలా నడుచుకుంటూ వచ్చిన కృపాచార్యులవారు హనుమత్ క్షేత్రం వద్దకు వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం ముందుకుసాగలేదు. అలాంటి దశలో కృపాచార్యుల వారు తన తోటివారికి శ్రీవారి దర్శనం కష్టంగా వుందని తలచి శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని ప్రార్థించారు. దీంతో కృపాచార్యుని హనుమత్ క్షేత్రంలో వెంకటేశ్వరుడు దర్శనమిచ్చారని ప్రతీతి. ఆయన కోరిక మేరకు తన దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా హనుమత్ క్షేత్రంలోని తనను దర్శించుకుని అనంతరం తిరుమలకు వస్తారని కృపాచార్యులకు శ్రీవేంకటేశ్వరస్వామి వరమిచ్చారని పురాణాలు చెపుతున్నాయి. తిరుమలకు తొలిగడపగా హనుమత్ క్షేత్రాన్ని కొలుస్తున్నారు. నేటికి కూడా తిరుమల కొండల క్రింద హనుమంతుని పెద్ద విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్ విగ్రహం వెనుకభాగంలో పెద్ద రాతిపై హనుమంతుని విగ్రహం వుంది. ఎందరో మహానుభావులు శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణకు కృషి చేశారు. వారిలో విజయనగర సామ్రాజ్యస్థాపకుడైన హరహరరాయులు, బుక్కరాయులు, సాళ్వవంశీయుడైన నరసింహరాయులు. కాగా నరసింహరాయులు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు స్వామి ఆరాధనకోసం అమూల్యమైన ఆభరణాలు మణిమాణ్యాలు సమర్పించారు. తిమ్మయ్య దేవ మహారాజు, ఉదయగిరి సీమలోని ఒక గ్రామానికి చెందిన రాబడిని ఆలయానికి ఇచ్చారు. శ్రీవేంకటేశ్వరస్వామికి పరమభక్తుడు, మహాభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు కడపలోనే ఉండి కడప రాయుడైన వెంకటేశ్వరుని ప్రత్యక్ష్యంగా సేవించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని సన్నిధిమండపం విజయనగరరాజుల కాలంలో, ఆలయ రాజగోపురం మట్లిరాజులకాలంలో నిర్మించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయంలోని రాజగోపురం, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయగోపురం ఒకేకాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. స్వామి వక్షస్తలం, కుడివైపు శ్రీవత్సచిహ్నంతో కూడిన మహాలక్ష్మిమూర్తి చెక్కబడింది. స్వామివారి మందిరానికి ఎడమవైపున శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక మందిరం ఉంది. అమ్మవారి ఆలయంలోని పై భాగంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన కంచిలో మాదిరిగానే రాతిబల్లులు మలచబడివున్నాయి. ఈ బల్లులను తాకితే బల్లులవల్ల వచ్చే దోషాల నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి.