కడప

ఎన్నికల కేంద్రాల వద్ద భారీ పోలీసు బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 9: పోలింగ్‌కేంద్రాలవద్ద ఇద్దరికి మించి గుంపులుగా ఉన్న జనాలను లేకుండా చూడాలని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు లేనివారు ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే మొబైల్ పార్టీకి ఫోన్ చేయాలని ఎస్పీ అభిషేక్ మహంతి స్పెషల్‌పార్టీ పోలీసు సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. మంగళవారం పోలీసు కార్యాలయంలో సురక్షభవనంలో స్పెషల్‌పార్టీ సిబ్బందికి ఎన్నికల కేంద్రాల వద్ద బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వేచ్ఛను కల్పించాలన్నారు. ప్రశాంతవాతావరణానికి ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని , అలాగే మొబైల్‌టీమ్‌పార్టీకి సమాచారాన్ని ఎప్పటికప్పుడు శాంతియుత వాతావరణంపట్ల సమాచారాన్ని అందించాలని వారికి జిల్లా ఎస్పీ సూచించారు. ఎలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా తొలిదశలోనే వాటిని అణచివేయడానికి కృషి చేయాలన్నారు. వంద మీటర్ల దూరంలో ఉన్న పరిధిలో జనం లేకుండా చూడాల్సిన బాధ్యత స్పెషల్‌పార్టీ పోలీసులదే అన్నారు. ఓటర్లు మాత్రమే క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసులు సేవలు అందించాలన్నారు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ముగిసేంతవరకు ఆయా పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దిశ నిర్దేశం చేశారు. సీఏపీఎఫ్ 6కంపెనీల పోలీసు బలగాలు, ఎస్‌ఐ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి పోలీసులు 4వేల మంది, ఐఆర్‌బీ పోలీసుబలగాలు 6కంపెనీలు, స్పెషల్‌పార్టీ పోలీసు బలంగాలు 20 ప్లాటూన్లు, జిల్లావ్యాప్తంగా ఎన్నికల సరళిలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును నిఘానేత్రంతో పర్యవేక్షిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాగభూషణం, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, స్పెషల్‌పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.