కడప

జగన్ జలదీక్షకు మద్దతుగా పెండ్లిమర్రిలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లిమర్రి,మే 17: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం పెండ్లిమర్రి తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైకాపా మండల కన్వీనర్ చంద్రారెడ్డి, మండలాధ్యక్షురాలు అనూరాధ, ఉపమండలాధ్యక్షుడు వెంకటశివారెడ్డిల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని నిర్మాణాలను ఆపివేయించాలని, అప్పుడే రాయలసీమకు సాగునీరు, తాగునీరు లభ్యవౌతుందన్నారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కెసిఆర్‌ను అక్రమ ప్రాజెక్టులపై నిలదీస్తే చంద్రబాబునాయుడు యొక్క అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి చూస్తు ఉండటం బాధాకరమన్నారు. రాయలసీమప్రాంతం తాగానీరు, సాగునీరు లేక అలమటిస్తుంటే చంద్రబాబునాయుడు విదేశాలకు విహారయాత్రలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కొంతమేరకు పూర్తయిన ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సర్పంచ్‌లు రఘునాధరెడ్డి, పెద్దసిద్దారెడ్డి, సిఆర్‌ఐ మల్లేశ్వరరావు, రాజారెడ్డి, రవీంద్రారెడ్డి, వైకాపానాయకుడు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయలసీమ ఎడారే..
చెన్నూరు: తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమలో ప్రాజెక్టులతోపాటు నదులు ఎడారిగా మారే ప్రమాదం ఉందని జిల్లా వైకాపా ప్రధానకార్యదర్శి చీర్ల సురేష్‌యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట జగన్ జలదీక్షకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులతోపాటు కుందూ, పెన్నా నదులకు కూడా నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కుందూ, పెన్నా నదుల్లో నీరు లేక తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మున్ముందు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని కావున తెలంగాణలో ప్రాజెక్టులు నిలిపివేయాలన్నారు. జగన్ జలదీక్షకు మద్దతుగా మండలం నుంచి భారీ ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు తహశిల్దార్ కార్యాలయం చేరుకున్నారు. ధర్నాలో మాజీ సర్పంచ్‌లు భాస్కర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, శివయ్యయాదవ్, మైనార్టీనాయకులు క్వారీస్, కరీం, పలువురు వైకాపా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.