కడప

గర్భిణీలకు సకాలంలో వైద్యసేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 17: ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణీగా నమోదు అయినప్పటి నుంచి ఆసుపత్రిలో సురక్షత ప్రసవం జరిగేంతవరకు వారికి అందాల్సిన అన్ని రకాల ఆరోగ్య, పోషణ సేవలు ప్రతి గర్భిణీకి అందేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి సత్యనారాయణ రాజును కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లాకలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 3మన భవిత2 కార్యక్రమం అమలుపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు గత మాసంలో 93శాతం మాత్రమే జరిగిందని తెలుపుతూ 100శాతం టీకాలు అందించేటట్లు తప్పక చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు 24 గంటలు తెరచి వుంచిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచాలన్నారు. కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాన్పు అయిన వెంటనే పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించేందుకు ప్రతి గర్భిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అనంతరం ఆరోగ్య కేంద్రాలు చెక్కుల రూపంలో ఇచ్చే పారితోషికాలు సుమారు 30శాతం వరకు క్లైయిమ్ చేసుకోకుండా నిరుపయోగంగా అవుతున్నందున సంబంధిత సిబ్బంది ఈ విషయమై అవగాహన కల్పించి చెక్కు పైకం డ్రా చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు నీటి నమూనా పరీక్షలు జరపని వాటర్ ట్యాంకులకు సంబంధించి నీటి పరీక్షలు నిర్వహించి సురక్షిత తాగునీరు సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2శేషయ్య, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సత్యనారాయణరాజు, బిసిహెచ్‌ఎస్ పాండురంగయ్య, డిఐఓ నాగరాజు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరావు, డిప్యూటి డిఎంఅండ్‌హెచ్‌ఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.