కడప

31న సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)మే 26: సిద్దేశ్వర ప్రాజెక్టును నిర్మించుకుని రాయలసీమను సస్యశ్యామలం చేసుకుందామని, ఇందుకోసం ఈనెల 31వ తేదిన చేపట్టిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపనకు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలిరావాలని సాధన సమితి అధ్యక్షుడు, కెసి కెనాల్ మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవగుడి చంద్రవౌళీశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సమితి యాత్ర పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా చంద్రవౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ సిద్దేశ్వర ప్రాజెక్టు నిర్మాణం జరిగివుంటే రాయలసీమలో 15లక్షల ఎకరాలకు సాగునీరు లభించేదన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1951లో ప్లానింగ్ కమిషన్ సిద్దేశ్వరం వద్ద కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణమై ఉంటే రాయలసీమలో 15లక్షల ఎకరాలకు సాగునీరు లభించి రాయలసీమ సస్యశ్యామలం అయ్యేదన్నారు. అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండటంతో మిగతా నీటిని మద్రాసు రాష్ట్రానికి తరలిస్తారనే మిషతోటి ఆంధ్ర ప్రాంత నాయకులు, రాయలసీమలోని కమ్యూనిస్టు పార్టీ నాయకులు సిద్దేశ్వరంప్రాజెక్టును వ్యతిరేకించారని, తెలుగుజాతి సమైఖ్యంగా ఉండి సువిశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు భ్రమలో ఉన్న రాయలసీమనాయకులు కూడా సిద్దేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కోస్తానాయకుల ప్రాబల్యంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకున్నారని, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల ఒక టిఎంసి కూడా రాయలసీమకు రాదన్నారు. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును ఏర్పాటుచేశారని, శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. కేవలం రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు విద్యుత్ కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే విమర్శకులు ఈ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూడిపోకుండా ఇసుకను మాత్రం నిలబెట్టేవిధంగా ఉందని ఆనాడు పలువురు విమర్శించారు. అయితే ఏదేమైనా శ్రీశైలం ప్రాజెక్టు నుంచే రాయలసీమకు నీరు రావాల్సివుంది. అయితే కోస్తానాయకుల దురుద్దేశ్యంతో 854 అడుగుల ఎత్తు వరకు నిల్వవుంచాలని ప్రతిపాదించిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను 835 వరకు తగ్గిస్తూ జిఓ నెం.69 ద్వారా 1996లో తగ్గించడం జరిగింది. అయితే రాయలసీమకు నీరు తరలించాలంటే పోతిరెడ్డిపాడు ఏకైక వనరు. పోతిరెడ్డిపాడుకు నీరు అందాలంటే శ్రీశైలం నీటి మట్టం కనీసం 841 అడుగులు ఉండాలి. అయితే 835కు తగ్గించడం వల్ల చుక్కనీరు లేకుండా మొత్తం నాగార్జునసాగర్‌కు చేరుతుంది. రాయలసీమ వాసుల ప్రాజెక్టులైన హంద్రీ-నీవా, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, గాలేరు-నగరి వీటన్నింటికీ పోతిరెడ్డిపాడు నుంచే నీరు రావాల్సివుంది. అయితే కోస్తానాయకుల దురుద్దేశ్యం వల్ల సుమారు 500 టిఎంసిలు సముద్రం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిద్దేశ్వరం ప్రాజెక్టును మనమే నిర్మించుకునేందుకు కదలిరావాలని, సిద్దేశ్వరసాధన యాత్రలో భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. మన శే్వదంతో మన మట్టితో మన రాయితో మన సిద్దేశ్వరం మనమే నిర్మించుకుందామన్నారు. కావున ఈనెల 31వ తేదిని సిద్వేశ్వరం అలుగు శంకుస్థాపనలో రైతులు, ప్రజలు పాల్గొని పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సాహితి అవార్డు గ్రహీత విశ్వనాధరెడ్డి, రాయలసీమ అభివృద్ధివేదిక అధ్యక్షుడు ఓబులరెడ్డి, జెవివి నాయకులు రఘునాధరెడ్డి, రైతు సంఘం జిల్లా అద్యక్షుడు రామసుబ్బారెడ్డి, నారాయణ, రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఓబులరెడ్డి, ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగి రఘునాధరెడ్డి పాల్గొన్నారు.