కడప

మా గ్రామంలో మద్యం అమ్మకాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లంపేట, జూన్ 17:ఆ గ్రామంటే నిన్నటి వరకు నాటుసారా కాపుకు ప్రసిద్ధి. ఏ ఇల్లు చూసినా నారా కాపు కాయడమే జరిగేది. అటువంటి గ్రామంలో సారాపై పూర్తిస్థాయి పరివర్తన వచ్చింది. వత్తలూరు పంచాయితీ ఈడిగెపల్లెకు చెందిన శంకరయ్య, మల్లెయ్య, కుమార్, నరసింహులుతో పాటు 20 మంది గ్రామస్తులు తమ గ్రామంలో మద్యం అమ్మకాలు వద్దని, బెల్ట్‌షాపులను ఎత్తివేసి మద్య రహిత గ్రామంగా చర్యలు తీసుకోవాలని డిటి రవీంద్రరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మద్యానికి బానిసలై ఆరుగురు మృతి చెందారని, మరో 20 మంది ఆనారోగ్యం పాలయ్యారన్నారు. గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామమంతా మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు.