కడప

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూన్ 17:ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో డీఈఓ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్కాలర్‌షిప్పులు పొందే అవకాశం విద్యార్థులకు ఉం టుందన్నారు. అదే ప్రైవేటు స్కూళ్లలో ఈ సౌకర్యాలు ఏవీ ఉండవన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందన్నారు. దీనివలన భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంఇఓ రామక్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, డిప్యూ టీ డీఈఓ రంగారెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.