కడప

పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూన్ 17: బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను జూలై 15లోగా రెన్యువల్ చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయ ప్రత్యేకాధికారి మరియు ఎల్‌డీఎం రఘునాథరెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం స్థానిక మెప్మా కార్యాలయంలో జేఎం ఎల్‌బీసీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎల్‌డీ ఎం రఘునాథరెడ్డి, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్, మెప్మా పీడీ, డీఆర్‌డీఏ పీడీలు హాజరయ్యారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె క్లస్టర్లకు సంబంధించి పంట రుణాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎల్‌డీ ఎం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్లకు సంబంధించి 2015-16గాను లబ్ధిదారులకు త్వరితగతిన నాన్ ఆపరేషన్ ఎస్‌బీ అకౌంట్లు, లోన్ అకౌంట్ నెంబర్ పెంటన్-1లో పూర్తి చేసి పంపించాలన్నారు. ఎస్‌హెచ్‌జీ రికవరీలలో ప్రభుత్వ అధికారులు బ్యాంకు అధికారులు ఎన్‌పీ ఏ అకౌంట్లను తగ్గించాలని ఏపీజీబీ ఆర్‌ఎం తెలిపారు. ప్రతి బ్యాంకు అధికారి సీసీసీ కింద రుణాలు విడుదల చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీ ఆర్‌డీఏ పీడీ తెలిపారు. లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, గాలివీడు, రామాపురం, సంబేపల్లె మండలాల ఎంపీడీఓలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ఈడీలు, పలు బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, మెప్మా అధికారులు, మండలాల అధికారులు పాల్గొన్నారు.