కడప

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 17:జిల్లాలో వ్యవసాయాన్ని మరింతగా విస్తత్ర పరిచి లాభసాటిగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్త కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో వివిధ శాఖల అధికారులకు వర్క్‌షాప్, ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011వ సంవత్సరం డేటా ప్రకారం జిల్లాలోని 5లక్షల హెక్టార్లలో వ్యవసాయం సాగులో ఉండగా, గత ఏడాది 3.9లక్షల హెక్టార్లలో మాత్రమే వ్యవసాయం సాగైందన్నారు. ఈ విధంగా లక్ష హెక్టార్ల సాగు తగ్గిందన్నారు. సాగు తగ్గడానికి గల కారణాలు వ్యవసాయాధికారులు తెలుసుకోవాలన్నారు. జిల్లాలో సాగుకు అనుకూలంగా ఉండి సాగులోకి రాని భూమి ఎంత ఉందో తెలుసుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయాన్ని విస్తృత పరిచేందుకు సాగులోకి రాని భూములను సాగులోకి తీసుకురావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయాధికారులు తమ పనితీరును మార్చుకోవాల్సి ఉందన్నారు. అధికారులందరూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అర్థమయ్యే సూచనలు చేసి వ్యవసాయ సాగును పెంచాలన్నారు. భూగర్భజల మట్టం , వర్షశాతం ఎప్పటికప్పుడు నమోదుచేసుకోవాలన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం కల్పించిన ట్యాబ్‌లను ఉపయోగించాలన్నారు. గ్రామం వారీగా సాగుచేసిన భూమి, వేసిన పంట ఉత్పాధన తదితర వివరాలు, అలాగే గతంలో జరిగిన ఉత్పాదన వివరాలు బేరీజు వేసుకుని వ్యవసాయ పెరుగుదలను చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. వ్యవసాయంలో అధికోత్పత్తి సాధించుకోవడానికి నవీన వంగడాలతోపాటు యాంత్రీకరణ చేయాల్సివుందన్నారు. క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి ఉత్పాధక వ్యయాన్ని తగ్గించే విధంగా రైతులను చైతన్య పరచాలన్నారు. ఈనెల 20న జరిగే ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వ్యవసాయం, అనుబంధశాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సామాజిక నవ విభాగ అధికారి నరసింహులు మాట్లాడుతూ రైతుకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించేందుకు అటవీశాఖ ద్వారా ఉచితంగా టేకు, రోజ్‌వుడ్, ఎర్రచందనం, నల్లమద్ది, వెదురు వంటి మొక్కలు రైతులకు అందించాలన్నారు. ఈసమావేశంలో పశుసంవర్థక, మత్స్య, సూక్ష్మనీటిసాగు, ఉద్యానశాఖ తదితర అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కల్పించేందుకు వివిధ సూచనలు చేశారు. అనంతరం వ్యవసాయశాఖ రూపొందించిన ప్రధానమంత్రి పసల్ బీమాయోజన, అటవీశాఖ రూపొందించిన 67వ వనమహోత్సవ బ్రోచర్లను జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జెసి-2 శేషయ్య, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ సంచాలకులు ఠాగూర్‌నాయక్, వెంకట్రావు, ఆత్మ పిడి, ఎంఐపి పిడిలు రమేష్‌రెడ్డి, భాస్కర్, సిపిఓ తిప్పేస్వామి, హార్టికల్చర్ డిడి సరస్వతి, మత్స్యశాఖ ఏడి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ సైంటిస్టు జాన్సన్ తదితర మండల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.