కడప

పత్తాలేని గృహ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 17:కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం ప్రతి ఒక్కరికీ శాశ్వత గృహం నిర్మించేందుకు పట్టణాలకు 6300 గృహాలు మంజూరుచేసింది. ఈ ఇళ్లల్లో కడప కార్పొరేషన్ పరిధిలో 4300, ప్రొద్దుటూరు పట్టణానికి 2వేల ఇళ్లను మంజూరుచేసి ఒక్కొక్క ఇంటికి రూ.5.50 లక్షలు కేటాయించి కేంద్రం లక్షా 50వేల రూపాయలు, రాష్ట్రప్రభుత్వం లక్షా 50వేల రూపాయలు, లబ్ధిదారునికి బ్యాంకు రుణం రూ.2లక్షలు, రూ.50 వేలు లబ్ధిదారుడు భరించాల్సి ఉం టుంది. అయితే ఇళ్ల నిర్మాణం జాడే కన్పించడం లేదు. అరకొర ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దంచేసి లబ్ధిదారులను ఎంపిక ఇంకా పూర్తి చేయలేదు. రాష్ట్రప్రభుత్వం పదేళ్లక్రితం రచ్చ బండ, ప్రజాపథం, ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం కింద మూడు విడతల్లో జిఓ 171, జిఓ 33, జిఓ 44, జిఓ 23లకు మొత్తం కలిపి జిల్లాకు 294107 ఇళ్లను మంజూరు చేసింది. ఆ ఇళ్లల్లో గత మూడేళ్లక్రితం అక్కడక్కడ నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న 270500 ఇళ్లను నిర్మాణం పూర్తిచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిగాకనే పా త ఇళ్లకు కొత్త సొగసులుచేసి , అనర్హులకు ఇళ్లను నిర్మించినట్లు లెక్కలు రాసి కోట్లరూపాయల్లో కొంతమంది అధికారులు, కొంతమంది సిబ్బంది , కొంతమంది పాలకులు, చోటామోటా నాయకులు కోట్లాదిరూపాయలు స్వాహా చేశారు. గత మూడేళ్లక్రితం ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు నిర్దారించి 20మందిపై వేటువేశారు. రెండేళ్లక్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, కాంగ్రెస్ హయాం లో పనిచేసిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంజూరుచేసిన ఇళ్లపై అధికారపార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో తెలుగుదేశం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లల్లో నేటికీ 15వేల గృహాల లెక్కలు తేలడం లేదు. ప్రస్తుతం జిల్లాకు కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన 6300 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపికచేయాలంటే అధికారులు హడలెత్తిపోతున్నారు. ప్రభు త్వం ఏర్పడినప్పుడల్లా అధికారపార్టీ నేతల ఆశీస్సులతో ఇళ్లను మంజూరు చేయడం షరామామూలైంది. గతం లో జరిగిన అవకతవకలను అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనిర్మాణాలు చేపట్టాలంటూ అధికారుల హడలిపోతున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జియో ట్యాగింగ్ ఇళ్ల నిర్మాణాలపై ఉపగ్రహాల సాయంతో ఫొటోలు తీయడం, లబ్ధిదారుల ఎంపికపై అనేక ఆంక్షలను పెట్టడంతో ఆంక్షల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే అధికారులకు ఇళ్ల నిర్మాణాల ఎంపిక ప్రహాసనంగా మారింది. కేంద్రప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో 60శాతం ఇళ్లను మోడల్ కాలనీ తరహాలో నిర్మించడం, స్థలం తక్కువగా ఉంటే అపార్ట్‌మెంట్ తరహాలో ఒక అంతస్తు నిర్మించాల్సి ఉంది. కడప నగర సమీపంలోని చింతకొమ్మదినె్న బుగ్గవంక ప్రాజెక్టు సమీపంలో 2100 ఇళ్లను, మిగిలిన 2100 ఇళ్లను గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఇళ్లను నిర్మించాల్సి ఉంది. పట్టణాలకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని 2000 సంవత్సరానికి మునుపు రేషన్‌కార్డు కలిగి కడప , ప్రొద్దుటూరు నగరాల్లో నివాసమున్న వారే అర్హులని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలతో అర్హులైన వారికి కావాల్సిన సర్ట్ఫికెట్లు లేక, అనర్హులకు అన్ని సమకూర్చుకున్నా వారికి ఇళ్లు దక్కేది అనుమానమే. మొత్తం మీద జిల్లాలో గృహనిర్మాణాలంటే అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెత్తిసుండటంతో నాయకులు సిఫార్సులు చేయాలన్నా జంకుతున్నారు.